భూమితో
కలుసున్నప్పుడు
ఎండలలో
నీడనైనప్పుడు
చినుకులలో
గొడుగైనప్పుడు
నా
చాటున నువ్వు దాగుకున్నప్పుడు
ఆటలలో
స్నేహమనిపించలేదా?
ఆకలిలో
భాగమనిపించలేదా?
నోరు
లేని దానిననా?
రంపపు
కోతతో నన్ను ముక్కలే చేస్తున్నావ్!
నీకు
ఏమికాని దానిననా?
గొడ్డలి
దెబ్బలతో చిత్రహింసలే పెడుతున్నావ్!
నా
ఎదుగుదలలో ఎల్లప్పుడూ ఎన్నో
జీవాలు
సేద తీరుతుంటాయి
నన్ను
స్నేహంగా ఎంచుకుని ప్రాణానికి
హాయి
కలిగేలా నవ్వుకుంటుంటాయి
నీ
ప్రపంచాన్ని ఆశలతో పెంచుకుంటూ
నాకు
స్థానం విలువ లేకుండా చేస్తుంటావు
నీవు
రోగాల బారిన పడితే మాత్రం
శ్వాస
కొరకు కూడా అద్దెలు చెల్లిస్తావు
నా
అంతములోనే నీకు శాంతి ఉంటుందంటే
మరణ
ఘోషలో కూడా మౌనం వహిస్తాను
నేను
లేని లోటు నీకు శాపంగా మారకూడదని
మనస్ఫూర్తిగా
నీ కోసమే ప్రార్ధిస్తుంటాను...
నీకు
చెప్పేటంత దానినా
సృష్టికే
ప్రతిసృష్టి చేయగలవు నీవు
నిన్ను
నియంత్రించగల దానినా
బ్రతికిపోగలను
కటాక్షిస్తే నీవు
ఈనాడు
అడ్డమనిపించినా
కాలచక్రంలో
అవసరం ఉండచ్చేమో
ఇప్పుడే
ప్రాణం పోసినా
ఆస్వాదించడానికి
నువ్వుంటావో లేదో
అడవులకు
అంకితం చెయ్యకా
నా
స్థానాన్ని పునఃనిర్మించు
మా
వృక్ష జాతికై ఏకత్వాన్ని సంకల్పించి
నన్ను
విస్తరించు మన బంధాన్నే బలపరుస్తూ…!
No comments:
Post a Comment