స్థిరత్వాన్ని కోల్పోకు
ఆశన్నది నీకుంటే
శ్వాసగా మల్చుకో
ఆశయం నీకుంటే
ఆత్రుతగా గెల్చుకో
ఎందుకనే ప్రశ్న ఉంటేనే సమాధానం
ఎందుకీ ప్రశ్న అనుకుంటే
ప్రశ్నార్ధకమే ... జీవితం
ఆశన్నది నీకుంటే
ఒకరి ప్రోత్సాహంతో అవసరం రాదు
ఓర్పన్నది నీకుంటే
ఒకరి ఓదార్పు మాటలతో పనేలేదు
ప్రయత్నములో లోపముంటే
అడుగు ముందుకి సాగదు
ప్రయత్నించడమే నేర్చుకుంటే
గెలుపు నిన్ను చేరదా ...
భయానికో బద్దకానికో
నీవు బానిసవు కాకు
స్థిరత్వం లేని బ్రతుకుకి
చిరునామాగా మిగలకు
నిన్ను నువ్వు నమ్ముకుంటే
నాలుగు దిక్కులు నీవే
అది నిజమని చెప్పాల్సింది
నువ్వు ... నీ నవ్వే...!
No comments:
Post a Comment