చదువుకి అంతిమ రూపం ఉద్యోగమే
కష్టం చేయగలిగిన ఆశ్రయం ఉద్యోగమే
ఇదేమి విడ్డురమో ఇదేమి ధృక్పదమో
ఉద్యోగం రాకుంటే మనిషి బ్రతకలేడా?
ఉద్యోగం లేకుంటే మనిషి బాగుపడలేడా?
ఆకలి తీర్చే కంచములో కూడుతో
కలిపే కూరలు ఎన్నో వున్నా
బ్రతుకులో మాత్రము కాసులు
ఇచ్చే ఉద్యోగమే మిన్నంటారు
నిలకడ ఎక్కడుంటది ... నిధానం
ఎప్పుడుంటది
మధ్య తరగతి వాడి గుండెల్లోని
భారాన్ని మోసే వాహనమే ఉద్యోగం
ఏది అవసరం కాదు ఉద్యోగంలో నువ్వుంటే
అస్సలేమీ గుర్తుకురాదు ఉద్యోగం
నీకుంటే
No comments:
Post a Comment