Thursday, 22 January 2026

జన్మంటూ ఎత్తాక

 

జననమెట్టిదైన జన్మంటూ ఎత్తాక

జనుల నుండి పారిపోనూలేము

పైశాచికంగా తిరగబడనూలేము

ఆకాశం కింద ప్రతిదానికి సమయము

కలదనే సంగతి తలచి...

 

ఎదుగుదలనే గమనించు

జీవనశైలిని విశ్లేషించు

తప్పులను గ్రహించు...

 

ప్రమేయమే లేని కన్నీళ్ళు

గురి పెట్టి దాడి చేసినా

వాటిని దాటి కలలు కనడమే

నీ మనస్సునకు నేర్పించు

తీవ్రవాదంలాంటి నిరాశావాదం

నిన్ను వెక్కిరించినా మరిపించు...

 

అలవాటులే నిన్ను బలహీనపరిచినా

ఆలోచనలే అవరోధాలై ఆపేసినా

శ్వాస నిశ్చ్వాసాలు సాఫీగా సాగినన్నాళ్ళు

విశ్రమించకు విరక్తి చెందకు

 

నారు వేసినా నీరు పోసినా ఆ భగవంతుడే నీ తోడు

ప్రతి మనిషి నీకు సహాయ సాధనంగా మారగలడు

No comments:

Post a Comment