అప్పు తప్పు
అప్పులో తప్పు తప్పులో అప్పు
గుర్తించలేనంతగా కలిసిపోయుంటాయి
మొదట భయంగాను బాధగాను ఉన్నా!
అలవాటు పడిన చేతికి అదుపు లేకుండా పోతుంది
భారముగా మారి వీడని నీడలా వెంటాడుతుంది.
అవసరమో అనవసరమో తప్పులో భాగమైనోడికి
అప్పులో సాయమైనోడికి విడుదల లేకుండా పోతుంది
ఆవేశమే పెరిగి ఆయాసమే మిగిలిపోతుంది
చిక్కుకుని ఏడ్చేకన్నా వదిలించుకొని నవ్వడమే మిన్నా
అదుపు పొదుపు అలవాటున్నోడు
అవమానాల పాలవ్వడు
అప్పుకు తప్పుకి చిక్కి భారాన్ని పెంచుకొని
ఎప్పటికి బానిసవ్వడు
No comments:
Post a Comment