Thursday, 22 January 2026

యవ్వనమా నీ బలమెక్కడా?

 

మారుతున్న ఈ లోకం తీరులో

సాగుతున్న ప్రతి దినపు పోరులో

శరీరేచ్ఛల అల్లరి హోరులో

ఆశల రెక్కలు విచ్చే జోరులో

 

అక్షరాలు నేర్చిన ఆర్ధిక ఆటలో

అలూపే రాని ఆంక్షల వేటలో

అయోమయపు పొరపాటులలో

అజ్ఞానపు ఈ  జీవిత పరుగులలో

 

భయములేని బాధ్యత భారములలో

భరించలేని ఓటమి పాఠాలలో

కవ్వించి మురిపించే నిజంకాని ప్రేమలలో

హంగులకై చేసే అక్కరలేని అప్పులలో

 

వెర్రిక్కించే మద్యపు చుక్కలలో

తెలియక తెచ్చుకునే పరిస్థితులలో

ఆవేశంలో అనవసరపు మరణాలలో

 

సహించి తెగించి సాధించే విజయాలలో

సాటి మనిషికి చేసే నిస్వార్థపు సేవలలో

అల్లుకున్న కుటింబుకుల ప్రేమానురాగలలో

ఓ యవ్వనమా నీ బలమెక్కడా?

ఓ యవ్వనమా నీ గమ్యమెక్కడా?

No comments:

Post a Comment