Thursday, 22 January 2026

ఇంకెప్పుడు మారుతారు?

 

 

మన నుండి ఏదో ఆశించేవాళ్ళ కన్నా

మనల్ని మనలా ప్రేమించే వాళ్ళే మిన్నా !

 

ఆశించినది అందకపోతే

అనుమానిస్తారు అవమానిస్తాడు

చివరకి దూరంగా పెట్టేస్తారు

 

ఆశించిందల్లా అందించామా

పొగిడేస్తారు ప్రేమిస్తారు

ఆఖరికి దేవుడనేస్తారు

 

కళ్ళు మూసుకొని పిల్లి పాలు

తాగినట్టు మన కళ్ళ ముందే

మనకు సినిమా చూపిస్తారు

 

కుండలోని కూడు కుండలోనే ఉండాలంటారు

బిడ్డ మాత్రమూ అమాంతము ఎదిగిపోవాలంటారు

 

కష్టములేని ఆర్జితములో సంతృప్తి

కరువై ఆశీర్వాదముండదు

ఇంకెప్పుడు మారుతారు? ఇకనైనా

మార్చుకోండి మీ బ్రతుకులు వేయండి

ఆనందము వైపు మీ అడుగులు

 

58. అప్పు తప్పు

No comments:

Post a Comment