రిపబ్లిక్ డే సందర్భంగా తపస్వి మనోహరం అంతర్జాల ebook కొరకు కవిత...
అంశం : గణతంత్ర దినోత్సవం
రచన : ప్రేమ్ సాగర్ కోటపూరి
ఊరు : కోవూరు,నెల్లూరు జిల్లా
చరవాణి : 9542000079
శీర్షిక : గణతంత్ర రాజ్యంగా
ప్రతిధ్వనించే దేశభక్తి స్పూర్తితో
పోరాడి పొందుకున్న స్వాతంత్ర్యం
విజయ గర్వానికి గౌరవానికి ప్రతీకైతే..
తన ఉనికిని ప్రపంచ పటంలో
దృఢంగా నిలబెట్టాలని
కలలుగన్న సమ్మిళిత
సమాజాన్ని నిర్మించాలని
సంపూర్ణ స్వయం పాలనలో
మహాశక్తిగా ఎదగాలని..
అంబేద్కరుడి నాయకత్వంలో
మేధావుల సహాయ సహకారాలతో
తిరుగులేని రాజ్యాంగాన్ని రూపొందించి
ప్రభుత్వాన్నే ఎన్నుకునే అవకాశం తెచ్చింది..
స్వేచ్ఛా సమానత్వములతో
న్యాయం వంటి విలువలతో
హక్కులతో సౌభ్రాతృత్వాన్ని
పౌరులకు హామీగా ఇచ్చింది..
వలస పాలన నుండి-సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా-సగర్వంగా నా స్వతంత్ర భారతదేశం నిలిచింది..
✍️అనిర్వ✍️
@ ప్రేమ్ సాగర్ కోటపూరి
ఈ కవిత నా స్వీయ రచనని హామీ ఇస్తున్నాను...
No comments:
Post a Comment