డబ్బును ఆధారము
చేసుకొనే బంధాలు
డబ్బును ఆశిస్తూ
సాగే బంధుత్వాలు
ఉంటే ఎంతా? లేకుంటే ఎంతా?
పుట్టుకతో వచ్చిన బంధుత్వాలైనా
మధ్యలో కలుపుకునే బంధాలైనా
ఆత్మీయతను బలపరచుకొని
సంతోషాన్నో సంత్రుప్తినో ఇవ్వాలే
గానీ
గాయాన్నో రోగాన్నో పెంచేలా
ఉండకూడదు..
ఆత్మ విమర్శను తోడు చేసుకొని
బలాన్నో భరోసాన్నో ఇవ్వాలే
గానీ
ద్వేషాన్నో అసహ్యాన్నో మిగిల్చేలా
ఉండకూడదు
ఒకరి బాధని ప్రసాదంలా పంచుకోవాలే
గానీ
బంధుత్వాలను బంధాలను
మంచిగా కొనసాగిద్దాం
రేపటి తరాలకు మన వంతు
నమ్మకాన్ని అందిద్దాం… ఇది
మన బాధ్యతే కదా!
No comments:
Post a Comment