Thursday, 22 January 2026

పాత్రను కాను



నేను గెలిచిన వారి కథలు

వినడానికి ఎంత ఇష్టపడతానో  

మంచో చెడో నా గురించి చెప్పే

కథలు వినడానికి ఇంకా ఇష్టపడతాను

 

కన్ను కాచిన నిద్రను

ఖర్చు చేసిన క్షణాలను

తిరిగి పొందలేను

చేజారిన అవకాశాల్ని

నిశ్శబ్దంగా నిలచిన

అవమానాన్ని కొలవలేనుకానీ!

 

పడిన ప్రతిసారి నిలబడగలను

ఒకనాటికి ఓటమికే నా గెలుపుని

బహుమానంగా ఇవ్వగలను

 

చెప్పే కథలే ఒకరి గెలుపుకి

కొలమానమనుకుంటే

ఎవరో రాసిన కథలో పాత్రను కాను

నేనంటూ రాసే కథలో కథానాయుడుని నేను

No comments:

Post a Comment