ఉద్యోగమా ఉద్యోగమా
అర్థమవుతదా నా ఉద్వేగం
నీకు నేను బానిసను కాదు
బానిసత్వం నాకు హక్కు కాదు
!
ఆకలివాడు కేకలు వేస్తుంటే
ఆశల వాడు లోపల సాధిస్తుంటే
తిరగబడలేని నిస్సహాయంతో
తలవంచి చేస్తున్న నీతో ప్రయాణం
అహంకారులుకు అధికారులుకు
దండాలని చెప్పుకుంటూ
బ్రతుకు తెరువు కోసం విడిచే
కన్నీరుని తుడిచేస్తూ చేస్తున్న నీతో ప్రయాణం
నిన్ను బట్టి గుర్తిస్తారు
నీ స్థాయిని చూసి ప్రేమిస్తారు నువ్వుంటే గౌరవానికి తగినవాడినంటారు..లేకుంటే కానివాడినంటారు
ఆశ లేక కాదు ఆశయం కుదరక కాదు
అవసరం తెచ్చిన ఇరుకులలో
అరువు తెచ్చుకున్న నవ్వులతో
చేస్తున్న నీతో ప్రయాణం
నా కుటుంబం సౌకర్యం కోసం....
No comments:
Post a Comment