Friday, 23 January 2026

బలమైన పోటీ

 

 

కష్టాల కదలికలో

కనులే మూస్తే కన్నీరూ

దారాలంగా జారుతుంటాయ్

 

కష్టాలను కసితీరా చూస్తు

ముందుకి అడుగులే వేస్తే

అవే కనుమరుగై పోతుంటాయ్

 

కలల ప్రపంచంలో
నిద్రిస్తూ నిజం కాని

దానిని చూస్తూ విజయాన్ని

ఊహిస్తూ ఉండేకన్నా

 

కలను నిజం చేసుకునే

గొప్ప అవకాసం వస్తుందని

ప్రయత్నిచడంలోనే అసలైన

మజా ఉంటుంది

 

మనలో దాగిన సామర్ధ్యం

ఉన్నతంగా ప్రదర్శించబడాలంటే

మనలో పోటీతత్వమైన ఉండాలి

లేదా బలమైన పోటీలోనైనా మనముండాలి

No comments:

Post a Comment