Wednesday, 28 January 2026

సవాలు విసిరింది

అనంత సాహితీ వేదిక 

ప్రతి దినం పద/వాక్య కవిత్వ పోటీకి...

తేది : 04/02/2026 బుధవారం 

అంశము : "ఆలోచనల అంచున..."


రచన : ప్రేమ్ సాగర్ కోటపూరి 

ఊరు : కోవూరు, నెల్లూరు జిల్లా 

చరవాణి : 9542000079


శీర్షిక : సవాలు విసిరింది!

 

చీకటి కమ్మేసి మౌనంలో జీవించే

ఓ మనస్సు మీద...

ఉనికిని చాటాలని వెలుతురుగా

ప్రసరించాలని విశ్వప్రయత్నమే

మొదలెట్టింది ఒక దీపం?

 

అంతటి సాహసమా?ఎందుకో?

ఏమి సాధించాలనో?ఎవరికి చూపించాలనో?

ఆ వీర పోరాటం... 

 

ఈ పోరులో గెలుపెవరిదో మరి!

కాలమే చెప్తూందిలే సమాధానమని

అనుకుంటూనే....

 

దారిన పోయే ఓ దానమ్మా (దీపమా)

నీకెందుకమ్మా ఈ సాహసమంటే?

ఎంత గొప్పగా చెప్పిందో?

 

కొన్ని క్షణాలలో కరిగిపోయే జీవితం 

కలిగిన నేను వెలిగేది ఎంత సేపైనా!

అలసిపోను నిలిచిపోను

వదిలిపోను కుంగిపోను


పరిమాణం చిన్నదైనా!

పరిణామాలు ఏమైనా!

అడగలేదని ఎదురుచూడను!


నా పరిధిలో దాగిన 

మేలు ఏదైనా చేయాల్సిందే! 

అప్పుడే పుట్టుకకు అర్థము

బ్రతుకకు పరమార్థము!


అంటూ నాకే సవాలు విసిరింది! 


ఒక ప్రశ్నతో రేపటి కోసం

ఆలోచనల అంచున నిలబెట్టింది!

సమాజంలో సాటి మనిషిగా 

నా పాత్రను గుర్తుచేసింది!



✍️అనిర్వ✍️

@ ప్రేమ్ సాగర్ కోటపూరి 


ఇది నా స్వీయ రచనేనని హామీ ఇస్తున్నాను...

No comments:

Post a Comment