ఫలితం తెలియని ప్రయత్నం
ఊహకందని గెలుపునిస్తుంది
ఫలితం తెలిపే ప్రయత్నం
ఆశకి అందమే చేకూరుస్తుంది
శ్రద్ధే లేని ప్రయత్నం
అనుకోని ఓటమై నినుచేరుతుంది
ఫలితమేంటో ప్రయత్నామేంటో
అనే వారు అక్కడే ఉండిపోతారు
ప్రయత్నం మనిషిది ఫలితం దేవునిదనే
వారి దృక్పథమే వేరు
అందరిలో కొందరే గెలుపు కోసమే
బరిలో నిలబడతారు
చాలామంది భయంతో మధ్యలోనే నిలచిపోతారు
గెలుపోటముల మధ్య సంఘర్షణ ఎప్పుడు ఉండేదే ఈ జీవితంలో ... కానీ!
ఆగిపోయి నిందలేయకు
అలసిపోయి ఆపివేయకు
లక్ష్యము వైపు నువు వేసే ప్రతి అడుగు
గెలుపై ఎదురొచ్చి పడుతుంది నీకే గొడుగు
ఓటమిని గౌరవించడంలో
ప్రయత్నాన్ని ప్రేమించడంలో
దాగుంది అసలైన గెలుపు...!
No comments:
Post a Comment