Thursday, 22 January 2026

నా కూతురివే నువ్వు

 


వసంతాలు తెచ్చిన గర్భంబున

నవమాసాలు చేసిన యుద్ధంబున

మమ్మే చేరిన తొలకరి కిరణమే - నువ్వు


విరబూసిన పువ్వుల హల్లులలో

చిరునవ్వుల సందడిలో భవిష్యనిధివై

మమ్మే చేరిన ఆశా కిరణమే - నువ్వు


విహార వేటలో అల్లరి దారిలో

సంతోషాల స్నేహానికి భరోసావై

మమ్మే చేరిన కాంతి కిరణమే - నువ్వు


అనిర్వ @ ప్రేమ్ సాగర్ కోటపూరి



No comments:

Post a Comment