జన్మనిచ్చిన తలిదండ్రులకు బద్ధుడనై గౌరవమనే ప్రేమకు విధేయుడనై భారాన్ని భాద్యతయని మనసారా భావించాను
సమిస్టిగా సమన్వయము కలిగుంటే సమాజానికి మేలనుకుని స్నేహమే
అందుకు బలమనుకున్నాను
వంచనకు కూడా అదునుంటుందని
నిధానంగానే నేర్చుకున్నాను
కలిసికట్టుగా నిర్మించగల ప్రేమామయమైన కోట... కుటుంబమే అనుకున్నాను
అందుకు తగ్గ ప్రేమకోసం
వెతుకులాడాను మోసపోయాను
అరిచేకుక్క కరవడంటారు
కరిచేదైతే తరమమంటారు
ఇలాంటి మాటల మూటల
మాయలో నన్ను నేనుకోల్పోయాను
ఎందుకంటే పాలు పోసింది నేనే! విషపు చాయలు చూసింది నేనే!
నాతో ఎవరు ఎన్ని ఆటలాడిన?
పడడం సున్నితత్వంతో నమ్మడం
వంచన పాలు కావడం బలహీనత కాదు పిరికితనం అంతకన్నా కాదని
ఎవరి కథలు ఎలా ఉన్నా ?
ఇది నా కథ అని చెప్పగలిగేలా
బ్రతుకు మీద ఆశ ఉన్నవాడినని
విరిగి నలిగినా తిరిగి గెలవగలిగేలా నిలబడగలగడం నవ్వగలగడం నా
బలమైన నైజమని...
నిత్యమూ అన్వయించుకోగల
గొప్ప సత్యాన్ని గ్రహించుకున్నాను
✍️ అనిర్వ ✍️
@ ప్రేమ్ సాగర్ కోటపూరి
ఇది నా స్వీయ రచనేనని హామీ ఇస్తున్నాను...
No comments:
Post a Comment