దేశమా
నీవు క్షేమమా
అంతటా
నీకు సౌఖ్యమా
కులం
పేరున ముట్టకుంటిమి
మతం
మాయన విడగొట్టుకుంటిమి
కుల
మాతాలకూ అతీతమైన నా దేశంలో
సమానత్వమే
ఓ సాహస ప్రయత్నమా?
వృక్ష
జాతినే తొలిగిస్తూ హరిస్తుంటిమి
మిద్దెల
హంగులను విస్తరించుకుంటిమి
పల్లెటూరులే
పట్టుకొమ్మలనే నా దేశంలో
అర్ధంలేని
అభివృద్ధే అద్భుత వ్యూహమా?
విద్య
విలువను రూపాయితో పంచుకుంటిమి
వైద్యం
మాటున వ్యాపారాన్ని పెంచుకుంటిమి
విద్యా
వైద్యం ఉచితమనే నా దేశంలో
అక్షరాలకు
రోగాలకు ఆ ఆకాశమే ఆధారమా?
స్వేచ్ఛను
పొంది స్వచ్ఛతను పోగొట్టుకుంటిమి
నీతినే
మరచి న్యాయాన్ని కోరుతుంటిమి
సార్వభౌమాధికారం
కలిగిన నా దేశంలో
సామాన్యుడిగా
బ్రతకడమే శాపమైన వరమా?
సరదాలలో
మార్కులతో పోటీపడుతుంటిమి
సంస్కృతిని
మరిచే సంస్కారాన్ని నేర్చుకుంటిమి
నేటి
బాలలే రేపటి పౌరులని చెప్పే నా దేశంలో
యువతకు
మార్గనిర్దేశకమే ఓ యుద్ధ కావ్యమా?
ధన
దాహములో వనరులనే నిర్ములిస్తూంటిమి
అధికార
మోజులో ప్రజలనే నమ్మిస్తుంటిమి
అంతా
తామై నడిపించిన నాయకులున్న నా దేశంలో
భావితరాల
భవిష్యత్తుకు ప్రశ్నలే పరోపకారమా ?
అజ్ఞానమో
ఆవేదనో అర్ధమైయి అర్ధంకాని
పదాల
కూర్పులతో రాసుకున్న మాటలే ఇవి!
No comments:
Post a Comment