Tuesday, 13 January 2026

బాలలంటే

 తపస్వి మనోహరం అంతర్జాల పత్రిక కొరకు బాలల కవిత...


అంశం : బాలలు 

తేది : 13/01/2026


రచన : ప్రేమ్ సాగర్ కోటపూరి 

ఊరు : కోవూరు,నెల్లూరు జిల్లా 

చరవాణి : 9542000079


శీర్షిక: బాలలంటే...


బాలలంటే భారము కాదు 

భేరాలు అంతకంటే కాదు

బాలలంటే బానిసలు కాదు

భవిష్యత్తు లేనివారస్సలే కాదు


చిట్టి చేతులతో గొప్ప మనస్సును 

చాటగల పరమాత్ముని రూపాలు


బాలలంటే శ్రామికులు కాదు

కార్మికులు కానే కాదు

బాలలంటే నేరాలు కాదు

ఘోరాలు అస్సలే కాదు


చిక్కులు లేని చిరునవ్వులతో

అమాయకపు చేష్టలతో

హృదయాలను ఆనందంతో

నింపగల వెలుగు కిరణాలు


అర్థవంతమైన జీవితం అందివ్వగలిగితే...


దేశపు రూపు రేఖలు 

మార్చగల శక్తే వాళ్ళు

సమాజంలోని స్పర్ధలను

తోలివేసే సమర్థులే వాళ్ళు


@ ప్రేమ్ సాగర్ కోటపూరి

(✍️అనిర్వ✍️)


ఈ కవిత నా స్వీయ రచనని హామీ ఇస్తున్నాను.

No comments:

Post a Comment