Thursday, 1 January 2026

సకల సంపదల వేదిక - మన సంక్రాంతి

 ముగిసిపోతున్న శీతాకాలమే వెచ్చని రోజులను పిలవగా - పుడమి తల్లి ఒడిలోని పంటలు ఇంటికే చేరగా 


ముగ్గులు గొబ్బెమ్మలతో ముంగిళ్ళు సొగసుతో మురియగా - భోగి మంటలు పిండి వంటలు నూతన శక్తినే అందించగా


హరిదాసు కీర్తనలు పగటి వేషగాళ్ళ నర్తనలు లోగిళ్ళలో సందడి చేయగా - కోళ్ల ఎడ్ల పందేలు గాలిపటాల విన్యాసాలు ప్రకృతినే అందంగా వినోదంతో సింగారించగా


పట్టు పరికిణీలతో ఆడపడుచులు ఊర్లనే రంగుల హరివిల్లులా మార్చేయగా - 

జీవనంలో భాగమైన ప్రతివాటిని గుర్తించి పూజించి గౌరవించగా


అభివృద్ధిని ఆనందాన్ని కాంక్షించి భోగ భాగ్యాలను ఎదజల్లే సంబరాల వేడుక -  

కలిసి మెలిసుండాలని కనువిప్పునిచ్చే సకల సంపదల వేదిక - మన సంక్రాంతి

No comments:

Post a Comment