Monday, 31 December 2012


సిగ్గు పడుతున్నాను తల్లి
నేను సిగ్గుపడుతున్నాను
సిగ్గు పడుతున్నాను చెల్లి
నేను సిగ్గుపడుతున్నాను .....

అలసి పోతున్నారు ఆడవారు
మగవాడి వేటాడే చూపులకు
తల్లడిల్లి పోతున్నారు ఆడవారు
భయం పుట్టించే మగవాడి అరుపులకు .....
                                                  సిగ్గు పడుతున్నాను తల్లి
                                                  నేను సిగ్గుపడుతున్నాను చెల్లి

చచ్చి బ్రతుకుతున్నారు ఆడవారు
మూర్ఖపు మగవాడి చేష్టలకు
బ్రతుకు జీవుడా అని అర్ధిస్తున్నారు ఆడవారు
అహాంకారి మగవాడి అధికారాలకు ....................
                                                  సిగ్గు పడుతున్నాను తల్లి
                                                  నేను సిగ్గుపడుతున్నాను చెల్లి

చీకటి వెలుగుల మధ్య
తేడానే లేకుండా
నలిగి పోతున్నారు ఆడవారు
మగవాడి కాలి కింద చీమ వలె  .......
                                                  సిగ్గు పడుతున్నాను తల్లి
                                                  నేను సిగ్గుపడుతున్నాను చెల్లి

చిన్న పెద్దా అంటూ
తేడానే లేకుండా
లోకాన్నే విడుస్తున్నారు ఆడవారు
మగవాడి వదిలే సిగరెటు పొగ వలె
                                                  సిగ్గు పడుతున్నాను తల్లి
                                                  నేను సిగ్గుపడుతున్నాను చెల్లి

మగవాడి నన్నా గర్వమా
మగవాడికి ఇంత బలము
అందుకే నెమో .............
మగవాడి ఒంటికి ....కంటికి
ఆడదంటే అంత బలహీనము .....
                                                 సిగ్గు పడుతున్నాను తల్లి
                                                 నేను సిగ్గుపడుతున్నాను
                                                 సిగ్గు పడుతున్నాను చెల్లి
                                                 నేను సిగ్గుపడుతున్నాను.......

ఏ అన్నకు వున్నా చెల్లి లో
ఏ తల్లి కి కలిగిన కూతురో .......

మనుషులలో మృగాలు
వెంటాడి వేటాడు తుంటే
మానం...ప్రాణం కోసం
ఒంటరి పోరాటం చేస్తున్నారు ........
                                       సిగ్గు పడుతున్నాను తల్లి
                                       నేను సిగ్గుపడుతున్నాను చెల్లి

పిచ్చి కుక్కలా వలె
పిచ్చి నా కొడుకులు
కనిపించే ఆడపడుచులను
కామపిశాచులై పిక్కూతింటున్నారు ..........
                                              సిగ్గు పడుతున్నాను తల్లి
                                               నేను సిగ్గుపడుతున్నాను చెల్లి

మానాన్ని భక్షిస్తుంటే
ప్రాణాల్ని  హరిస్తుంటే
ఎర్రి బాగు ఆడపిల్లలు
పిల్ల లై రోధిస్తున్నారు...........
                                           సిగ్గు పడుతున్నాను తల్లి
                                          నేను సిగ్గుపడుతున్నాను చెల్లి

మగ జాతిలో ఒకడి నై నందుకు
సిగ్గు పడుతున్నాను తల్లి
                            నేను సిగ్గుపడుతున్నాను
మృగాల్లాంటి మగాళ్ళ మధ్యనున్నందుకు
సిగ్గు పడుతున్నాను చెల్లి
                            నేను సిగ్గుపడుతున్నాను

Thursday, 27 December 2012

నా నైజం


ప్రియా!

అవకాశం  ఇవ్వకుండానే
ఆలోచన చేయకుండానే
మంచి చెడు తెలుసుకునే
ప్రయత్నం చేయకుండానే

ప్రకటించిన నా ఆశను
త్రుంచి వేయడం ...........నీకు న్యాయమా !

నేను ఏమిటో
నా ఆలోచన ఏమిటో ......తెలుసుకోకుండానే

నువ్వు ఏమిటో
నీ ఆలోచన ఏమిటో ......చెప్పకుండానే

ఇష్టం లేదంటూ నన్ను
నీవు దాటి పోవడం ..........నీకు న్యాయమా !

ప్రపంచం లో  అతి ప్రాముఖ్యత
కలిగిన మూడు మాటలను
తమ సౌకర్యం కోసంగా
వాడుకుంటున్న మాటలను
నీకు చెప్పి స్వార్ధపరుడినిగా
నీ ముందు నేను నిలువలేను .......అది నా నైజం

స్నేహమంటూ  నిన్ను చేరుకొని
సరదాగా సమయాన్ని గడపలేక కాదు
ప్రేమంటూ నిన్ను కలుపుకొని
ప్రాణం అంటూ నీ చుట్టూ తిరగ లేక కాదు

ఫై రెండింటిని  సైతం తనలో
నింపుకొని మనల్ని ముందుకు నడిపే
బంధం....భార్యాభర్తల సంబంధం
అన్యులకు అర్ధం కాని అనుబంధం...........

సమస్యలలో  స్నేహితుడినవుతా
సరదాలలో ప్రేమికుడినవుతా
భాద్యతలలో భరించే భర్తనవుతా
జీవితాంతం నీ వెంట నేనుంటా..............






Wednesday, 26 December 2012

అక్క !


అక్క !
ఏ తమ్ముడు ఇవ్వనటువంటి
బహుమతి ఇవ్వాలని
ప్రపంచం లోనే అందమైనది
నీకు తెచ్చివ్వాలని పరిగెడు తున్న
క్షణాన జారి పడితే తెలిసింది ................నా అవివేకం

నీ నవ్వుని మించిన అందాన్ని
నేను ఎందులోనూ చూడలేనని
ఆ నవ్వు నీకు ఎప్పుడు దూరం
కాకుండా చూసుకోవడమే
తమ్ముడిగా నా భాద్యతని ..............

అక్షరాలను జత కలిపి
కవి అవతారమెత్తి
నీకో కవిత రాసివ్వాలను కున్న
క్షణాన గుర్తుకు వచ్చెను  నాకు ......నా ఆవేశం

నీ కళ్ళలోని కరుణ ముందు
మాటలోని మంచి ముందు
స్పర్శలోని ప్రేమ ముందు
ఏమని చెప్పను ....ఎంతని చెప్పను
నీ తమ్ముడిగా నేను అదృష్ట వంతుడనని.............


అమ్మ ప్రేమకు ప్రతి రూపమైన
మరో రూపము నువ్వు
అడగకనే దేవుడిచ్చిన
అనుబంధము నువ్వు ............

అక్క.....
ఈ జన్మలో
నీకు తమ్ముడనైన
మరు జన్మలో
నీకు తనయుడిని ....అవ్వాలని కాంక్షిస్తూ చెబుతున్న.....అక్క .....జన్మదిన శుభాకాంక్షలు

ఇట్లు....
తనయుడి కాని తమ్ముడు
తనయుడితో సమానమైన తమ్ముడు
ఇప్పటికి .....ఎప్పటికి... ....నీ తమ్ముడు




Sunday, 23 December 2012

మనిషిని నేను ..........


నేను మనిషినే
అని నమ్మే ప్రతి ఒక్కరిని
కలవాలను కునే స్వార్ధపరుడిని........

ప్రేమించే ప్రతి మనిషిని
ప్రేమించాలను కునే
సామాన్యమైన ప్రేమికుడిని ........

ప్రతి చిన్న కష్టానికి
దేవుడు లేడనుకునే
గొప్ప నాస్తికుడిని .......

ఆకలి తీరు తున్నప్పటికి
అనుకున్నది జరగలేదనుకునే
దురదృష్ట వంతుడిని............

అందరికి కన్నీళ్ళు వున్నా
నాకు ఉండకూడా దనుకునే
అలవాటైన ఆశ జీవిని .....................

ఎన్ని చెప్పినా
ఏమి చెప్పినా
కష్టాలకు దూరంగా
కోరికలకు దగ్గరగా ......

జీవించాలను కునే
సగటు మనిషిని నేను ..........






Tuesday, 25 September 2012


ఓరకంటి చూపులు చూడకు
అందమైన నవ్వులు నా ఫై విసరకు
మౌనం వహించి మరి హింసించకు
ప్రేమో కాదో నాంచక తెల్పు నాకు

ప్రేమిస్తే ఇతరులకు భయపడకు
లేకుంటే నా మసుతో ఆడుకోకు

లవ్ సి

ఎప్పటి నుంచో నా మది చేస్తుంది నీ ధ్యానం
ఆశతో అర్ధిస్తున్న కావలి నీ అంగీకారం
మన మధ్య ప్రేమను పెంచాలి నీ సమాధానం
నీ అభిప్రాయం కోసం చూస్తున్నాను ప్రతి దినం

తిరస్కరించిన పర్వాలేదు వహిస్తాను మౌనం
ఉద్రేక పడి కలిగించాను ఏనాటికి నీకు ఆటంకం
ఎప్పటికైనా నా మనస్సు నీకే అంకితం
నా ప్రేమ పవిత్రం నువ్వు గుర్తిస్తే సంతోషం


నేను ఎల్ల వేళల కోరుకునేది నీ క్షేమం
నీ రాక కోసం ఎదురు చూస్తాను జీవితాంతం..............

లవ్ సి


నా చూపులు నీ కోసం
అన్వేషిస్తున్నాయే ప్రతి నిమిషం
నాకు అందకుండా నీవున్నావు కాని
నా మనసంత నీ ప్రేమ మయం.........

నిన్ను చూసిన క్షణం నుండి
నా గుండె చప్పుడు నీవు అయ్యావు
నా ప్రాణపు ఉపిరిగా మారవు
హృదయపు చిరునామాగా వున్నావు ......

లవ్ సి




సంధ్య వేళకు నీ కోసం ఎదురు చూసే
కళ్ళకు నీ రాక ఎంతో ఉరటనిస్తుంది

నువ్వు వస్తే నీ ఒడిలో వాలి పోవాలని
రోజంతా గడిపిన క్షణాలను నీకు చెప్పాలని

వేచి వున్నాను తలుచు కుంటూ నీ జ్ఞాపకాల్ని
అర్ధము చేసుకొని చేరాలి నీవు నా దరిని.................

లవ్ సి
www.premkavithalu.blogspot.in
prem.saagar.k@gmail.com

Tuesday, 18 September 2012


ఆశన్నది నీకుంటే
శ్వాసగా మల్చుకో
ఆశయం నీకుంటే
ఆత్రుతగా గెల్చుకో .......

ఎందుకనే ప్రశ్న ఉంటేనే
సమాధానం దొరుకును
ఎందుకీ ప్రశ్న అనుకుంటే
జీవితం ప్రశ్నార్ధకమే అవును  .......

ప్రయత్నములో  లోపముంటే
అడుగు ముందుకి సాగదు
ప్రయత్నించడమే నేర్చుకుంటే
గెలుపు నిన్ను చేరును....................


లవ్ సి
www.premkavithalu.blogspot.in
prem.saagar.k@gmail.com

ప్రియతమా! చెప్పనా
ఒక చిన్న మాట
ఎదలో పుట్టిన
అది గొప్ప మాట ......

మాటలో దాచిన
మౌనంలో పెంచిన మాట
రేపనే ప్రశ్న కైనా
సమాధానం ఆ మాట ............

నా పెధవంచులోన
నలుగుతున్న మాట
నీకు చేర్చగల్గిన
నాలో నిండిన మాట......

మధురమైన ఆ మాట
నీ మనసు నింప గలిగితే
నీవు నాను చేరి
నా కోసం చెప్పా గలిగే మాట .......

ప్రియా... ఆ మాట
ఇప్పటికి ఎప్పటికి ఒకటే
నేను నిన్ను ప్రేమిస్తున్నా.....

ప్రేమ మన మధ్య చిగురిస్తే
జీవితమంతా ప్రేమను నీకు బహుకరిస్తా .........


లవ్ సి
www.premkavithalu.blogspot.in
prem.saagar.k@gmail.com

ప్రేమంటే ఏమిటో
తెలుసుకో లేక పోతున్న
ప్రేమించాలని వున్నా
ప్రేమించలేక పోతున్న ......

ప్రేమంటే ఇదేనని
ఖచ్చితంగా అనుకోలేకపోతున్న
ప్రేమను చెప్పాలని వున్నా
ప్రేమను చెప్పలేకపోతున్న ............

ప్రేమంటూ వస్తే అంధుడనైన
కాదంటూ వెళ్తుంటే పిచోడినైన
ప్రేమ గుండెల్లో గునపమే దింపిన
ప్రేమ ఫై గౌరవంతో మౌనంగా నిల్చున్న ......

ప్రేమించాలని నా మనసు
తెలిసి పరుగులు తీస్తున్న
ప్రేమను చెప్తే నీ మనసు
కాదంటదేమోనని ఆలోచిస్తున్న .........

నీవు అవునన్నా కాదన్నా
నిజం చెప్తున్నా .......నిన్ను ప్రేమిస్తున్నా .....

లవ్ సి
www.premkavithalu.blogspot.in
prem.saagar.k@gmail.com

Monday, 17 September 2012

ఆడ జన్మకు వందనం .........




Title : ఆడ జన్మకు వందనం .........

తల వంచి పలుకుతున్న
అహం మరిచి చెబుతున్న
చేయెత్తి జై కొడుతూ
ఆడ జన్మకు వందనం .........

వెలుగు లేని బ్రతుకులలో
నలిగి పోతూ మీరు
చావు దెబ్బ తింటున్న
కడుపు నింపుతున్నారు .......

భాద్యత తెలియని భర్తలతో
కాపురాలు మీకు
కష్టమునే కౌగలిస్తూ
నవ్వు చూపుతున్నారు .........

నాలుగు గోడల మధ్య
కలలు కంటూ మీరు
అహంకార వేడిలో
అక్షరానికి దూరమౌతున్నారు..............

మనసు విలువ తెలియని
మృగాల మధ్య మీరు
చితి మీద తోడుగా
కాలే కట్టెగా మిగులుతున్నారు....................

ఆడదంటే ఆటలాడే బొమ్మ కాదు
ఆడు కొని వదలడానికి ...........
ఆడదంటే అంగడిలోని సరుకు కాదు
అవసరానికి  అమ్ముకోడానికి..........

ఆడదంటే ఎందుకంత అలుసు
ఆడది కాదు కంటిలో నలుసు
కావాలంటే కనడానికి
వద్దనుకుంటే వదించడానికి...................

రక్తపు ముద్దకు
అమ్మతనంతో
హద్దులు లేని ప్రేమనిచ్చేది .............ఆడదంటే

మనిషికి మనసులా
మమతకు ఆత్మలా
విడదీయలేనంతగా అల్లుకు పోయేది.....ఆడదంటే


తల వంచి పలుకుతున్న
అహం మరిచి చెబుతున్న
చేయెత్తి జై కొడుతూ
ఆడ జన్మకు వందనం .........



లవ్ సి 

లోకంలో వున్నాను నేను ఒంటరిగా
నా జీవితం మారెను సుడిగుండంగా
ఏది తలచిన జరుగుతుంది నాకు వెతిరేకంగా
నా గూర్చి తెలిసిన వారు చూస్తున్నారు జాలిగా ...................

అందుకే బ్రతుకు మీద నాకుంది విరక్తిగా
చివరి శ్వాసను విదిస్తేనే వుంటుంది హాయిగా
అనుకున్న క్షణాన కనిపిస్తివే ఒక జవాబుగా
నీవున్నావు నా మనసుకి నచ్చిన విధంగా..............

వున్నది నాకు నిన్ను అందుకోవాలని ఆశగా
బ్రతుకుతున్నాను కేవలం నీ కోసంగా
దేవుడ్ని కోరుకుంటున్నాను నేను చివరగా
అది నీవు చేరువుకావాలి నాకు చేలియగా.....................

నిన్ను చుసిన ఆ మరుక్షణం
నాలో కలిగెను ఏదో తెలియని భావం
అట్టి ఆలోచన కలగడం ఇదే ప్రధమం........

ప్రతి నిమిషం మనసంత నీ జ్ఞాపకం
ఏమిటో తెలియదు...ప్రేమని అనుమానం .......

నా హృదయం లో ముద్రించుకున్నాను నీ రూపం
నిన్నే మనసారా కోరుకుంటున్నాను ఇది సత్యం
నువ్వు- నేను వుండాలి ఒకరికి - ఒకరై కలకాలం............

ప్రేమ.................



Title:   ప్రేమ.................


ప్రేమ.................
ప్రేమను ప్రేమిస్తుంటే.......

ప్రేమిస్తున్న ప్రేమ
ప్రేమలో మునుగి పోతుంటే .......

ప్రేమను చుసిన ప్రేమ
ప్రేమించాలను కుంటుంటే ............

ప్రేమించిన ప్రేమ
ప్రేమను ప్రేమగా చూస్తుంటే.................

ప్రేమగా చూస్తున్న ప్రేమ
ఎప్పటికి ప్రేమై పోతుంటే ................

ప్రేమను గెలుచుకోవాలనే
ప్రేమ పుడుతుంటే......................

ప్రేమగా పుడుతున్న ప్రేమ
ప్రేమను గెలిపిస్తుంటే...........

ప్రేమగా గెలుస్తున్న ప్రేమ
ప్రేమగా నిలుస్తుంటే.....................

ప్రేమగా నిలవాలని
ప్రేమించిన ప్రేమంటుంటే..................

ప్రేమను ప్రేమగా పొందుతున్న
ప్రేమ ఆనందిస్తుంటే.......................

ప్రేమించిన ఆనందంలో ప్రేమ
ప్రేమకే స్వాగతమిస్తుంటే.......................

ప్రేమకై ప్రేమిస్తున్న ప్రేమ
ప్రేమగా మారి పోతుంటే...................

ప్రేమై పెరుగుతున్న
ప్రేమను ప్రేమ పంచుకుంటుంటే ..................

ప్రేమ కోసంగా ప్రేమ
ప్రేమను పెంచుకుంటుంటే...................

ప్రేమలో ప్రేమ
ప్రేమగా ఒదిగి పోతుంటే....................

ప్రేమలా ప్రేమ
ప్రేమలో సాగి పోతుంటే...................

ప్రేమిస్తున్న ప్రేమ ప్రేమను
కనులలో ధాచుకుంటుంటే..................

ప్రేమగా దాగి వున్నా ప్రేమ
ప్రేమనే సొంత మంటుంటే ....................

ప్రేమకై ప్రేమ ప్రేమలా
ప్రేమై తాకుతుంటుంటే...................

ప్రేమ ప్రేమకి
ప్రేమతో తలవంచుతుంటే....................

ప్రేమను ప్రేమతోనే
వంచించాలని ప్రేమంటుంటే......................

ప్రేమలో ఓడినా ప్రేమ
ప్రేమను గెలిపించాలని ప్రేమిస్తుంటే....................

ప్రేమించిన ప్రేమ
ప్రేమను వీదలేనునంటుంటే...................

ప్రేమను వీడగల్గిన ప్రేమ
ప్రేమను బ్రతికించగల నంటుంటే....................

ప్రేమ ప్రేమను వదలదని
ప్రేమ తోడుగా ప్రేమ చెబుతుంటే.......................

ప్రేమ ప్రేమై ప్రేమకి
ప్రేమలా చిరునామౌతుంటే.......

ప్రేమను చిరునవ్వుతో ఆహ్వానిస్తూ
ప్రేమను ప్రతి క్షణం ఆనందిస్తూ
ప్రేమను నిత్యము ప్రేమిస్తూ
ప్రేమను ఆరాధించే ప్రేమ

లవ్ సి
www.premkavithalu.blogspot.in
prem.saagar.k@gmail.com



ఎంత చెడ్డ .......నీ నేస్తాన్ని




Title: ఎంత చెడ్డ .......నీ నేస్తాన్ని


నా ఫై నీకు కోపమా !
మౌనముతో ముచ్చటించకు
నా పైన కన్నెర్ర చేయకు ..........

చల్లని నీ చెలిమిలో సాగుతున్న
నా అడుగకు అడ్డు వేయకు
దరి చేరాలని నేను చెప్పే మాటలను
పెడ చెవినా నీవు పెట్టకు ...................

చంటి పిల్లాడిని కాను నేను
ఏడ్చి వురుకోవడానికి
గోడ మీద పిల్లిని కాను నేను
అరుపుతో అవతలకి దూకడానికి...................

ఎంత చెడ్డ .......నీ నేస్తాన్ని
ఎప్పటికి నిన్ను.....వదలిని నీడని.............

ఎందుకే నా ఫై నీకి కోపం ......?
ఏమి చేయనే నేను .............?

వెన్నలలోని చల్లదనాన్ని
నీ కళ్ళలో చూసే నాకు
మండే సూర్యుడిని చూపితే
నేను  నిల్వ గలనా ................

వెచ్చని నీ కౌగిళ్ళలో
ప్రపంచాన్ని మరిచే నాకు
ఒంటరి తనాన్ని చూపితే
నేను తట్టుకో గలనా ........

ప్రియతమా !

ఆలోచించవే ఒకసారి
ఆలోచనలతో నడుస్తాను
ఆచరణతో నిన్ను గెలుస్తాను

లవ్ సి
www.premkavithalu.blogspot.in
prem.saagar.k@gmail.com

నిరీక్షణ




Title: నిరీక్షణ

ఒంటరిగా సాగుతున్న నా ప్రాణం
వెతుకుతున్నది ఓ తోడుకోసం
ఎదురు చూస్తున్నది నీ రాక కోసం .............

మనసన్నది వున్నదని
తెలిసిన క్షణం నాలో అయోమయం ........

ఆ అయోమయం లో
క్షణాలు గడిచినా
నిమిషాలు పరిగెత్తినా
గంటలు సాగినా
రోజులు మారినా......

నీ రాక....నా కనులు
కాచుకొని చూస్తున్నాయి.....

ఇలలో నీవు ఉన్నవో
కలలోనే వుంటావో
తెలియక తిక మకతో
నా లో కలిగిన తృష్ణతో ........

నీవు వచ్చే క్షణం కోసం .....
నిరీక్షిస్తున్నాను..................

లవ్ సి
www.premkavithalu.blogspot.in
prem.saagar.k@gmail.com

ఫలితం.........ప్రయత్నం




Title: ఫలితం.........ప్రయత్నం


ఫలితం కోసమే ప్రయత్నాలు
చేసే వారు కొందరు..............

ఫలితం తెలియని ప్రయత్నాలు
చేసే వారు ఇంకొందరు.......................

ఫలిత మేంటో......ప్రయత్నామేంటో
అని ఆగి చూసే వారు కొందరు ..................

ఫలితం దేవునిది ... ప్రయత్నం మనిషిది
అని మాటలనే వారు ఇంకొందరు .......


అందరు అన్నా ............. కొందరే అన్నా
ప్రయత్నమన్నది........ గెలుపు కోసమే


గెలుపోటముల మధ్య
సాగే ఈ జీవితంలో ......

ఓటమిని .......... గౌరవించు
ప్రయత్నాన్ని........ప్రేమించు
గెలుపును ....... ఆస్వాదించు
ఆ ఫై అంతటా..... ఆనందించు


లవ్ సి

www.premkavithalu.blogspot.in
prem.saagar.k@gmail.com

ప్రపంచానికి నేను ప్రశ్నల ఉండాలా?




Title: ప్రపంచానికి నేను ప్రశ్నల ఉండాలా?


అన్వేషించే కనులకు
సమాధానం నీ రూపం
నిరీక్షించే మనసుకు
సమాధానం నీ స్నేహం .......

సాగుతున్న అడుగు
ఆగి ఆగి అడుగుతున్నది
నిన్ను చేరే క్షణం వస్తుందా అని ?......

నన్ను చేరిన ప్రశ్నకు
పదే పదే చెబుతున్న
నిన్ను చేరే క్షణం వస్తుందని ..........


నా అన్వేషణకు....నా నిరీక్షణకు
అంతం చెప్పుతూ నన్ను చేరుకుంటావా.......లేక
అవి అనంతమని మనసుకి చెప్పుకుంటూ
నన్ను సాగి పొమ్మంటావా ........

ప్రియా !
ప్రపంచానికి నేను ప్రశ్నల ఉండాలా?
లేక .....
ప్రేమకు చిరునామాగా మారాలా......
నీవే చెప్పాలా...........

లవ్ సి

ప్రియా నా కోసం.........



Title: ప్రియా నా కోసం.........


ఏవో చేయాలనీ వున్నది నీ కోసం
ఏమిటో అనే ఆలోచనే ప్రతి నిమిషం
అడుగే దూరంగా ....మనసే మౌనంగా
నన్నే వీడి పోకే నా ప్రాణం .......


నీకే చెప్పాలని వుంది నా ఫీలింగ్
నిన్నే చూస్తే ఎందుకో ఈ షివెరింగ్
నీకే నిజమైన .....ప్రేమను నేనేగా
నమ్మక పోతే ఎలాగా నేస్తం ..........


అందరిలోన నేను వేరే హృదయం
నా గుండెలో నీవేప్పటికి పదిలం
ఆశకు హద్దుందా....ప్రేమకు అంతుందా
గమనించవ ప్రియ నా కోసం.........

లవ్ సి
www.premkavithalu.blogspot.in
prem.saagar.k@gmail.com

Monday, 10 September 2012

నా జీవితంలో కొందరే ...........



Title: నా జీవితంలో కొందరే ...........

ఈ ప్రపచంలో ఎందరో వున్నా
నా జీవితంలో కొందరే ...........

కమ్మని ప్రేమను చూపే అమ్మ
ఒడిన చేర్చుకొని జాగ్రతను చెప్పే నాన్న
గుండె బరువెక్కినప్పుడు ఓదార్చే అక్క
అలసటలోను ఆటలాడుదామనే తమ్ముడు .....

ఒక్కడిని కాదు నేను
నలుగురికి అండను
అడుగుసాగానపుడు
వారికి నేను ఆశను......


ఆస్తి వున్నా లేకున్నా
అమ్మ ప్రేమ నాకుంది

వెలుతురున్నా లేకున్నా
నాన్న తోడు నాకుంది

అల్లరున్న లేకున్నా
అక్క మందలింపు నాకుంది

ఆకలున్న లేకున్నా
తమ్ముడి నవ్వు నాకుంది


ఒక్కడిని కాదు నేను
నలుగురికి అండను
అడుగుసాగానపుడు
వారికి నేను ఆశను.......

అమ్మ పేరు నమ్మకమైతే
నాన్న పేరు ధైర్యమౌతోంది
అక్క పేరు ఆలోచనైతే
తమ్ముడు పేరు ఆచరనౌతోంది .........

ఒక్కడిని కాదు నేను
నలుగురికి అండను
అడుగుసాగానపుడు
వారికి నేను ఆశను.........

ఓ ప్రపంచమా ఇటు చూడు
ఇదే నా కుటుంబం
ఇదే నా జీవితం
ఇదే నా మరో ప్రపంచం ......

భయమున్నా లేకున్నా భాద్యత నాకుంది

అలుపున్న లేకున్నా గెలుపు నాకందుతుంది


ఒక్కడిని కాదు నేను
నలుగురికి అండను
అడుగుసాగానపుడు
వారికి నేను ఆశను.........


 లవ్ సి

ఓ బాటసారి......... ఆలోచించావా ఒక్కసారి



Title:  ఓ బాటసారి...........  ఆలోచించావా ఒక్కసారి



గుండె నిండా ఆశ నింపుకొని
పొట్ట చేత పట్టుకొని
జీవితంలో సంతోషాన్ని అందుకోవాలని
అందరం అన్న మాట వదులుకొని

                                                   పట్టణం చేరిన ఓ బాటసారి
                                                   ఆలోచించావా ఒక్కసారి
                                                   ఎటువెలుతోందో నీ దారి........


అందమైన ఉహాలతో ఊరినే కాధాన్నావ్
అన్నం కోసం అద్దె బ్రతుకు బ్రతుకుతున్నావ్
కమ్మనైన అమ్మ ప్రేమ ఉంటె వద్దన్నావ్
కలలుకన్నా ప్రపంచంలో ఆకలితో పరిగేడుతున్నావ్

                                                            పట్టణం చేరిన ఓ బాటసారి
                                                            ఆలోచించావా ఒక్కసారి
                                                            ఎటువెలుతోందో నీ దారి........



అన్నదమ్ముల మధ్య ఐక్యమత్యం ఎందుకన్నావ్
అభిమానమే చూపేవారు కోసం అలసి పోతున్నావ్
కలిసుంటే చెంత చేరదు ఆధాయమన్నావ్
కనులు మూసుకొని కలలను చంపుకుంటున్నావ్

                                                            పట్టణం చేరిన ఓ బాటసారి
                                                            ఆలోచించావా ఒక్కసారి
                                                            ఎటువెలుతోందో నీ దారి........


అమ్మ  ప్రేమ ఎప్పటికి ఆశీర్వాదం
రక్తసంబంధం సమస్యకు సమాధానం
ఎవరి దారికైన తోడొకటి అవసరం
ఎవరి ఎదుగుధలకైన ప్రోత్సాహం అవకాశం

                                                            పట్టణం చేరిన ఓ బాటసారి
                                                            ఆలోచించావా ఒక్కసారి
                                                            ఎటువెలుతోందో నీ దారి........



మూర్ఖత్వంలో ఆలోచనలు వదులుకొని
ఆవేశంలో నిరాశ పడి పోయేకన్నా
అందరి సహకారంతో బంధాలను పెంచుకుంటూ
ఆనందాలను పంచుకుంటూ నీ గమ్యాన్ని చేరుకో

                                                            పట్టణం చేరిన ఓ బాటసారి
                                                            ఆలోచించావా ఒక్కసారి
                                                            ఎటువెలుతోందో నీ దారి........



లవ్ సి

prem.saagar.k@gmail.com
www.premkavithalu.blogspot.in












     
                                                             

Sunday, 9 September 2012

నా ప్రేమ .....నీ ప్రేమ కోసమై........



Title: నా ప్రేమ .....నీ ప్రేమ కోసమై........



గల గల పారే సెలయేరుల
నువ్వు నేను అలా అలా
మాట అనే నావను అందుకొని
అందరు వున్నా ఎకాంతంలోకి షికారు వెళదామా !........

ఒకరి భావాలను ఒకరు
ఒకరి భయాలను ఒకరు
ఒకరి ఆలోచనలను ఒకరు
ఒకరి ఆనందాలను ఒకరు
ఇరువురం భాద్యతగా పంచుకుందమా !...................

ఒకరి జీవితానికి ఒకరు
చిరునామాగా మారి
ఒకరి సమస్యకు ఒకరు
పరిష్కారముగా నిలుద్ధమా !......

అసలు ఈ జీవితం లో గెలుపంటే
ఒకరి ప్రేమను పొందడమే అనుకుంటే
ఒకరి కోసం ఒకరు అనే నిజాన్ని
ప్రపంచానికి చాటి మనల్ని మనమే గెలిపించుకుందమా !...........

నిన్ను గెలిపించాలనే ఆశతో
నీ కోసమే నీరిక్షిస్తున్నది.......
నా ప్రేమ .....నీ ప్రేమ కోసమై........

లవ్ సి
www.premkavithalu.blogspot.in
prem.saagar.k@gmail.com

అబద్ధాలు కానీ నిజాలు




Title : అబద్ధాలు కానీ నిజాలు


కనిపించే ఆకాశం
అడుగులకు దొరకదు........

కాళ్ళను తాకే సాగరం
చేతికి చిక్కదు...............

ప్రేమ లేని శృంగారం
సంతోషాన్ని ఇవ్వదు.......

గౌరవం లేని సంసారం
గుర్తింపు నివ్వదు ..........

నమ్మకం లేని నిజం
నిన్ను గెలిపించదు ............

స్వార్ధం లేని స్నేహం
ఎప్పటికి ఓడించదు .........

నవ్వు లేని జీవితం
అర్ధాన్ని ఇవ్వదు ......

లోపం లేని ప్రయత్నం
ఆశతో ఆగదు .............

లవ్ సి
www.premkavithalu.blogspot.in
prem.saagar.k@gmail.com



ఓ మనసా........... నా మనసా


TITLE :ఓ మనసా నా మనసా

ప్రేమంటే ఏమిటో తెలుసా
నా ఎదలో  దాగిన మనసా
నా శ్వాసకే శ్వాసవైతివే
నా ఆశకే రూపమైతివే .................

ఒకనాడు నిన్నే చూసి
నన్ను నేను మైమరిచి
ఊహిస్తినే ప్రేయసిగా
ప్రేమిస్తినే ప్రాణముగా....................

గుండె చాటున దాగిన ప్రేమ
నిన్ను చేరదే ఎందుకే భామ
నీ కోసమై నా హృదయమే
చేస్తున్నదే మౌనపోరాటమే.................

ఆశలన్ని నాలో వున్నా
నీకు చూపలేక వున్నా
ఆలోచనే ఆవేశమై
నిన్ను చేరితే కాదందువా.....................

నీ పైన నా ప్రేమ
నిజమని నమ్మవే చెలియా
నన్ను నీవుగా మార్చుకుంటినే
నీకు నీవుగా నన్ను చేరవే.................ఓ మనసా నా మనసా

లవ్ సి
www.premkavithalu.blogspot.in
prem.saagar.k@gmail.com
www.google.com

Friday, 7 September 2012

ప్రియా ఓ ప్రియా


Title:  ప్రియా ఓ ప్రియా


ప్రియా ఓ ప్రియా నీ కోసం
నేను చూస్తున్నాను ప్రతి నిమిషం.........

అడుగు తీసి అడుగు వేస్తే నీ రూపం
నీకు దూరంగా సాగనంటుంది నా పాదం.............

అసలు నీ దరహాసానికి నేను దాసోహం
అని అంటే అందరు చేస్తున్నారు పరిహాసం ...............

పరిహసంతో వారనే ప్రతి అక్షరం
పెంచుతుంది నీ ఫై నాకు ఇష్టం ..........

నీవు నా దానివైతే నా కధ సుఖాంతం
లేకుంటే తప్పదు ఈ భాధ నాకు జీవితాంతం...................


లవ్ సి
prem.saagar.k@gmail.com
www.premkavithalu.blogspot.in

చెలి! నీ ప్రేమ కోసం........



Title : చెలి! నీ ప్రేమ కోసం........


నిన్ను చూసే కంటికి
కునుకు పడుతుందా ? ..................

నిన్ను తలిచే మనసుకు
అలుపు వస్తుందా ?  ........................

నిన్ను కలిసే అడుగులకి
అడ్డు ఉంటుందా?  ............................

నిన్ను నడిపే చేతికి
వదలడం తెలుస్తుందా ?......................

నీ ఫై చూపే ప్రేమకి
పరిమితం ఉండగలదా ?.....................

వేగంగా సాగే ఈ కాలానికి
మన ప్రేమ ఎదురు నిలవగలదా?...............

అసలు నిజమైన ప్రేమకి
మరణం ఉంటుందా ?...............

చెలి!
నీవు బాగా ఆలోచించు
ఆ ఫై నన్ను ప్రేమించు......

లవ్ సి
prem.saagar.k@gmail.com
www.premkavithalu.blogspot.in

నా చెలి అందం ....ఓ అరుణోదయం


Title: నా చెలి అందం .....

ఆకాశ వీధిలో ఓ చంద్రమా
నా చెలియను గమనించుమా
నిన్నే మరిపించగల అందము
నా చెలియకే సొంతము .........

తను నిద్రుంచు వేళ్ళలో
ముల్లోకాలు తిరిగి చూడు
తనను మరిపించ గలవారు
ఎవరైనా దొరుకునేమో!..................

భిన్నత్వంలో ఏకత్వం
నా చెలియా రూపం
తన అందం ఓ అద్భుతం
తన సొగసు సాగరసంగమం .......................

నా జీవితం లో
తను ఓ అరుణోదయం
నా హృదయం లో
తన స్థానం శాశ్వతం....................ఎందుకంటే తను నా ప్రాణం

లవ్ సి
prem.saagar.k@gmail.com
www.premkavithalu.blogspot.in

Monday, 3 September 2012

గురువర్యులకు గౌరవంతో....కృతజ్ఞతలతో ఇదే నా అక్షరమాల..............


అమ్మ నాన్నలకు
ప్రతి రూపం గురువు
పెద్దల ఆశలకు
ఆచూకి గురువు.........

పిల్లల ఎదుగుదలకు
ఔషధం గురువు
అక్షరం విలువను
చెప్పేది  గురువు.........

మూర్ఖుల  మాటలకు
మంత్రము గురువు
ఆకలికి మర్యాదను
పెంచేవాడు  గురువు................

ప్రోత్సాహం వెనుక
ఉత్సాహం గురువు
గమ్మత్తుగా గమ్యాన్ని
చేర్చేవాడు  గురువు...................



భాధలకు భయం
తెలియని వాడు గురువు
భాద్యతకు అర్ధం
అందించే వాడు గురువు ................

ఓటమికి ఓర్పును
నేర్పేవాడు గురువు
ప్రయత్నమే గెలుపుగా
వర్ణించే వాడు గురువు..............అందుకే

గురువు ఆస్తి అక్షరం
తస్కరించడం ఎవడి తరం
గురువు స్థానం గోపురం
దేవుడికే నేర్పెను సంస్కారం.................

అట్టి గురువులు............

అక్షరాన్ని ఆయుధంగా చేసుకొని
ఆశను నర నరాలలో నింపుకొని
ఆజ్ఞానం నిండిన ప్రపంచం ఫై
అలుపెరగని యోదుడిల గర్జించి....................

నిశిధిలో ప్రయానించే
ఎందరో చిన్నారులకు
జ్ఞానం అన్న బలం చేకూర్చి
విజ్ఞానంతో ప్రపంచాన్ని నడిపించమని ..........................

తన వారసత్వాన్ని మనకు అందించి ..........
ప్రోత్సహించి ..........ప్రోత్సహిస్తూ.............
ఆత్మియకంగా అందరి గౌరవాన్ని .................
అందుకుంటూన్నా ఎందరో గురువర్యులు........


అందరికి వందనాలు....పాదాభివందనాలు
అలాంటి గురువర్యులకు
గౌరవంతో....కృతజ్ఞతలతో
ఇదే నా అక్షరమాల..............

లవ్  సి
prem.saagar.k@gmail.com 

Saturday, 1 September 2012

నిజం.......ప్రేమ చెప్పిన నిజం


Title: నిజం........ప్రేమ  చెప్పిన నిజం


ప్రేమించి ప్రేమించి
ప్రేమకు భానిసనైనాను
ప్రేమకు రూపం ప్రేయసేనని
ఇన్నాళ్ళు భ్రమలో బ్రతికాను..........

వయస్సు పొంగులో
అమ్మ ప్రేమను మరిచాను
ఎద పొంగులను చూస్తూ
ఎదవనై పోయాను .......................

నా వెంటా వచ్చే స్నేహం
ఎందుకనుకున్నాను
అందరున్నా ప్రపంచంలో
ఒంటరినై సాగుతున్నాను..............

ఆడదాని ఆలోచనలలో
అగాధమే ధాగివున్నాను
అర్ధము చేసుకో లేక
అంధకారంలో నిలిచాను................

ఎందరో మరెందరో
హెచ్చరికలు ఇచ్చినను
అందమైన ఆడదాని
మొహంలో అందుడనైనాను............

గుండెను కోసి ఇచ్చే ప్రేమ
నా దగ్గర ఉన్నను
అడిగితివే నన్ను నీవు
నా ప్రేమకున్న విలువను.............

నష్టం వచ్చి కష్టం తెచ్చిన
నీ కౌగిళ్ళలో మరవలనుకున్నాను
రెక్కలొచ్చిన పక్షి వలె
చేరావు కదే కాసులున్న షావుకారును......................

నీ నవ్వులు కోసం
నన్ను అమ్ముకున్నాను
నీ ప్రేమ కోసం
జీవితాన్ని వదులుకున్నాను................


ఎందుకే ఇలా చేసావు
రూపాయ్ కోసమా? ..........లేక........... హోదా కోసమా?

ప్రాణంగా ప్రేమించిన వాడిని
పైసలు ఈవ్వలేనా?
హృదయంలో దాచుకున్న వాడిని
హోదాను కల్పించలేనా?.......................

ఆడదాని అందం కోసమే
తిరిగే మగ పురుగులు
చాలానే వున్నాయనుకున్న.........కాని

మగవాడిని కూడా పీల్చుకుతినే
ఆడ తేనటిగాలు వున్నాయని
నీ వల్లే నేను తెలిసుకున్న!....................

మోసపూరితమైన ప్రేమతో
ఇన్నాళ్ళు ప్రేమలో ఉన్నందుకు
నేను చాలా సిగ్గుపడుతున్నా...............

స్వచ్చమైన ప్రేమకు
అర్ధం పరమార్ధమైన అమ్మను
చేరినందుకు ఆనందపడుతున్నా ....................



""మిత్రులారా ..........ప్రేమికులారా .......గుర్తుంచుకోండి .......... ఒక్కసారి ఆలోచించండి........

ప్రేయసి ........మోసం .................మనకొక అవకాశం

ఎందుకంటే...........అమ్మానాన్నల.........ప్రేమ ఆకాశం

వారి కున్న కోరిక.......ఎప్పటికి...................మన క్షేమం

వారి కున్న గమ్యం .........జీవితం ఫై ...........మన విజయం


"""""""""""""మోసపోయానని తనువు చాలించే కన్నా

   అమ్మనాన్నల కోసం బ్రతకడమే మిన్నా""""""""""""""""""""""""""""""


తల్లిదండ్రులను ప్రేమించండి.......
ప్రేమిస్తూనే ...........
వారిని గౌరవించండి.................

లవ్ సి
prem.saagar.k@gmail.com
www.premkavithalu.blogspot.in

Monday, 27 August 2012

ఇది నా ఆవేదన అర్ధము చేసుకో గలరా



విన్నారా ఎవరైన
మీలో ఎపుడైనా
ప్రేమకు నిర్వచనం
నాకు చెప్పగలరా..............

విన్నారా ఎక్కడైనా
మీలో ఎవరైనా
నిజమైన ప్రేమకు
చిరునామా చూపగలరా............

ఎక్కడుంది ఆ ప్రేమ
మతాన్ని మరవకుండా
ఎపుడూ వుంటది ఈ ప్రేమ
కులానికి దూరంగా.......

నిలువునా ఈ ప్రేమ
రుపాయీకి కరగకుండా
నడుచునా ఈ ప్రేమ
ఆశలకు ఆవిరయే పోకుండా..........

మిత్రులారా...
తల్లిదండ్రులారా......
ప్రేమకు అర్థాన్నే మార్చగలిగే ప్రేముకులరా!..................
ఒక్కసారి ఆలోచించండి ప్రేమంటే ఏమిటో....................

ఆలోచించి ప్రేమించండి
ప్రేమలో గెలవండి
ఓడిపోతున్న ప్రేమలను
బంధాలను గెలిపించండి..........


LOVESEA
prem.saagar.k@gmail.com
www.premkavithalu.blogspot.in

......చెప్పు స్వామి చెప్పు.........


ఓ భగవంతుడా !

నీ సృష్టిలో భాగమే కదా
ఈ మనుషులు
వారిలో భాగమే కదా
వారికున్న మనసులు .....

ప్రేమతో ప్రపంచాన్ని
గెలవమన్న నీ మాటలు
మనుషలకు అవసరానికి
ఉపయోగ పడే అక్షరాలూ......

ఎంతో మేలునయ్య
ఆలోచనలు లేని మృగాలు
అన్ని వున్నా ఈ మనుషలు
చేస్తున్నారు ఎన్నో తప్పులు...........


నాకు నీవు ఇచ్చిన ఈ జన్మ
వరమా లేక శాపమా......చెప్పు స్వామి చెప్పు.........


LOVESEA
prem.saagar.k@gmail.com

వివరము వివరించ గలవా......ప్రియా



ప్రియా!

నేను నేనుగా
ఉన్న వేళ
లేదే నాలో
ఎలాంటి గోల......

నీ ఓరచూపులు
తగిలిన క్షణం
నాకే తెలియని
ఏదో అయ్యోమయం......

హటాత్తుగా  ఏదైన
మాయ నన్ను కమ్మిందా!
లేకుంటే నాదిగా ఉన్న
మనస్సు నిన్ను చేరిందా!.......

ఆర్ట్స్ పిల్లాడికి
సైన్సు ప్రస్నాలా
ఏమిటే పిల్లా
నాకు ఈ పరీక్షా.............

వివరము వివరించ గలవా......ప్రియా
వింటూనే నీతో ఉండిపోతా............

LOVE SEA
prem.saagar.k@gmail.com
 

""""ఉదయం"""""




కలల ప్రపంచంలో
నిద్రిస్తూ నిజం కాని దానిని
అందులో నిజం చేసుకునే.......మానవ

లెమ్ము నిదుర లెమ్ము
కలను నిజం చేసుకునే
ఓ గొప్ప అవకాసం వచ్చింది......దాని పేరే """"ఉదయం"""""

నేస్తమా !
శుభోదయం సుమనోహర సూర్యోదయం

LOVESEA
prem.saagar.k@gmail.com

Saturday, 11 August 2012

నా జీవితానికి నీవే ముఖ్యం

ప్రియతమా!

చంద్రుడిలోని మచ్చ ఆయనకి అందమైతే
మదిలో నీ రూప ముండడం నాకు ఆనందం...........................


ఎగిరే గాలి పటానికి దారము ఆధారమైతే
నేను పొందే అనుభూతులకు నీవే కారణం.................................


ఒక రోజుకి రాత్రి పగలు ముఖ్యమైతే
నేను కలలు కనే జీవితానికి నీవే ముఖ్యం................................  


ఇట్లు

లవ్ సి

prem.saagar.k@gmail.com 

నీ గురించి నాకు తెలిసినవి


నీ చూపుల్లోని చిలిపితనం
నీవు రువ్వే నవ్వులలోని కైపుదనం
మాట్లాడే మాటల్లోని స్వచ్చదనం
ఇవి నీ ముఖానీకే తరగని అందం
స్పందింప చేసాయి నన్ను ఈ దినం.................

ఇట్లు

LOVESEA

prem.saagar.k@gmail.com

ప్రియా! నాకు అన్ని నువ్వే....అంతటా నువ్వే

ఓ ప్రియా!

కనులలో నువ్వే
కన్నిరులో నువ్వే
మదిలో కలిగే భావనకు రూపము  నువ్వే .......


ఆటలో నువ్వే
పాటలో నువ్వే
గొంతు చీల్చుకు పుట్టే మాటకు అర్ధము నువ్వే ........


అందము నువ్వే
ఆనందము నువ్వే
అందమైన ఈ ప్రకృతికి ప్రతిరూపము నువ్వే ................


స్వప్నములో నువ్వే
సత్యములో నువ్వే
సప్తస్వరములు కలిపి పలికే రాగము నువ్వే ........................


చిరునవ్వులో నువ్వే
చిరుకోపములో నువ్వే
గగనంలో గందరగోళం నుండి రాలు వర్షము నువ్వే ................


నటనలో నువ్వే
నడకలో నువ్వే
పురి విప్పి ఆడే నెమలి నాట్యముకు ఉపిరి నువ్వే ...................


ఆరాధనలో నువ్వే
ఆవేదనలో నువ్వే
ఆత్మీయత చూపే అనురాగ బంధము నువ్వే .....................ప్రియా! నాకు అన్ని నువ్వే....అంతటా నువ్వే...

ఇట్లు
 LOVESEA
prem.saagar.k@gmail.com 

Wednesday, 8 August 2012

ప్రేమిస్తే ఇలానే చెప్పాలని అనుకుంటా! మీరు ఏమను కుంటున్నారో చెప్పండి!


ఓ ప్రియతమా!

మదిలో మెదిలో మధురమైన
భావం  ఒకటి వున్నది
ఆధారముల పైన నిలిచి
నాట్యమాడు చున్నది........

నా ఎదలో దాగివున్న భావానికి
శ్వాస నీ రూపమైతే
నీ దారిని చేరలేకున్న భావానికి
ఆశ నీ స్నేహం.....................

మౌనముతో ఎన్నోసార్లు పిలిచినా
ఆవేశంలో ఎన్నోసార్లు అరిచిన
బిడియం భయంల మధ్య సంఘర్షణ
నన్ను నీ ముందు నిలవనీయకున్నవి.............

నన్ను నడిపే నమ్మకం ఆ భావం
నా ఎదలో నిన్ను నిలిపింది ఆ భావం
ఆ భావం ఎంతో స్వచ్చమైనది
నిన్ను చేరితే నాకు జీవితమౌతుంది...............

నన్ను అలలా తాకిన భావం
కలల  కాక నిజంలా నిన్ను తాకితే
నా మనసు పాడే పాట
ఈ ప్రపంచాన్నే జయిస్తుంది.......................

భావమన్నది ప్రేమైతే అంతటా ప్రకటిస్తూ
చెబుతున్నా ప్రియా !
                             నేను నిన్ను ప్రేమిస్తున్నా................................. ఇట్లు.......... prem.saagar.k@gmail.com

Tuesday, 7 August 2012

"""""ఆలోచనే""""""


ఓ మిత్రమా!

నీవన్నది నేనన్నది
ఉన్నదీ  ఎవరి కోసం........

మనమన్నది వారన్నది
బ్రతికేది ఎందుకోసం.........

ఆశల ఆకలి మధ్య
ఆకర్షణ ఎంతున్నా...........

వెత్యాసం తెలుసుకొని
బ్రతకడమే జీవితమన్నా.......

గెలుపోతమలు అన్నవి
ప్రపంచానికి ఓ సంకేతం............

కాలం క్రొత్తది చూపితే
గుర్తుంచుకునేది ఎవరి తరం.......

ఓటమిని అవమానం
అనుకుంటే పోరాపాటేనన్నా..........

ఓటమిని ఓ అవకాశం
అనుకుంటే ఆకాశం నీదన్నా.......

అవకాశముంది ఆకాశముంది
ఆలోచనే నీకు నిచ్చేనౌతోంది..........

Always be positive and think positive ..........prem.saagar.k@gmail.com

Monday, 6 August 2012

"""""""స్నేహమంటే""""""""""""




గుండె చప్పుడులో నీ స్నేహం
బరువెక్కిన కనులలో నీ స్నేహం
స్వచమైన నవ్వులో నీ స్నేహం
స్వేచగా వీచు గాలిలో నీ స్నేహం

సాగు అడుగులో నీ స్నేహం
ఆగిన ఆలోచనలో నీ స్నేహం
ప్రేమించే మనసులో నీ స్నేహం
ప్రేరేపించే మాటలో నీ స్నేహం

అమ్మ చెప్పిన నమ్మకం నీ స్నేహం
నాన్న చూపే జాగ్రత్త నీ స్నేహం
అందరికి అందని ఆనందం నీ స్నేహం
అంతా వున్నా నాకే సొంతం నీ స్నేహం ......prem.saagar.k@gmail.com

చిన్న ప్రశ్న


ఓ దేవుడా!

ప్రేమించే మనసుకు
ప్రేమించిన మనిషే
మాటలతో చేతలతో
గాయం చేస్తే అది ఎవరి తప్పిదము
ప్రేమించిన మనిషిదా లేక మనసుదా

అస్సలు ప్రేమంటే ఏమిటి? నాకు చెప్పగలవా......ఇట్లు...... prem.saagar.k@gmail.com

జన్మదిన శుబాకాంక్షలు


ఓ నా ప్రియ నేస్తమా
నేను నీకు ఎవరో
నీవు నాకు ఎవరో
అనే పరిస్థితిని పరిచయంతో దూరం చేస్తూ

నీ కోసమే నేను
నా కోసమే నీవు
అనే స్థితికి చేరుకున్న
మన బంధం ఇలానే ఉండాలని

ఆశిస్తూ అంతట ఆనందాన్ని ప్రకటిస్తూ
చెబుతున్న జన్మదిన శుబాకాంక్షలు......prem.saagar.k@gmail.com

నీవే చెప్పాలి ప్రియా!


ప్రియా!
నిన్ను చూచుట మొదటి సారని నా కనులు నమ్మిన  
ఎందుకో మరి నా మనసు నమ్ముట లేదు ప్రియ

మన ఈ పరిచయం ఇనాటిదే అని మనసును నమ్మించలేను
అలాగని ఆనాటిదే అని ఖచ్చితంగ చెప్పలేను  
జన్మలో నయన  మన బంధం
శాశ్వతమా లేక తాత్కాలికమా?   
నీవే చెప్పాలి ప్రియా!
…….prem.saagar.k@gmail.com
www.premkavithalu.blogspot.in