Monday, 3 September 2012

గురువర్యులకు గౌరవంతో....కృతజ్ఞతలతో ఇదే నా అక్షరమాల..............


అమ్మ నాన్నలకు
ప్రతి రూపం గురువు
పెద్దల ఆశలకు
ఆచూకి గురువు.........

పిల్లల ఎదుగుదలకు
ఔషధం గురువు
అక్షరం విలువను
చెప్పేది  గురువు.........

మూర్ఖుల  మాటలకు
మంత్రము గురువు
ఆకలికి మర్యాదను
పెంచేవాడు  గురువు................

ప్రోత్సాహం వెనుక
ఉత్సాహం గురువు
గమ్మత్తుగా గమ్యాన్ని
చేర్చేవాడు  గురువు...................



భాధలకు భయం
తెలియని వాడు గురువు
భాద్యతకు అర్ధం
అందించే వాడు గురువు ................

ఓటమికి ఓర్పును
నేర్పేవాడు గురువు
ప్రయత్నమే గెలుపుగా
వర్ణించే వాడు గురువు..............అందుకే

గురువు ఆస్తి అక్షరం
తస్కరించడం ఎవడి తరం
గురువు స్థానం గోపురం
దేవుడికే నేర్పెను సంస్కారం.................

అట్టి గురువులు............

అక్షరాన్ని ఆయుధంగా చేసుకొని
ఆశను నర నరాలలో నింపుకొని
ఆజ్ఞానం నిండిన ప్రపంచం ఫై
అలుపెరగని యోదుడిల గర్జించి....................

నిశిధిలో ప్రయానించే
ఎందరో చిన్నారులకు
జ్ఞానం అన్న బలం చేకూర్చి
విజ్ఞానంతో ప్రపంచాన్ని నడిపించమని ..........................

తన వారసత్వాన్ని మనకు అందించి ..........
ప్రోత్సహించి ..........ప్రోత్సహిస్తూ.............
ఆత్మియకంగా అందరి గౌరవాన్ని .................
అందుకుంటూన్నా ఎందరో గురువర్యులు........


అందరికి వందనాలు....పాదాభివందనాలు
అలాంటి గురువర్యులకు
గౌరవంతో....కృతజ్ఞతలతో
ఇదే నా అక్షరమాల..............

లవ్  సి
prem.saagar.k@gmail.com 

No comments:

Post a Comment