Title: నా ప్రేమ .....నీ ప్రేమ కోసమై........
గల గల పారే సెలయేరుల
నువ్వు నేను అలా అలా
మాట అనే నావను అందుకొని
అందరు వున్నా ఎకాంతంలోకి షికారు వెళదామా !........
ఒకరి భావాలను ఒకరు
ఒకరి భయాలను ఒకరు
ఒకరి ఆలోచనలను ఒకరు
ఒకరి ఆనందాలను ఒకరు
ఇరువురం భాద్యతగా పంచుకుందమా !...................
ఒకరి జీవితానికి ఒకరు
చిరునామాగా మారి
ఒకరి సమస్యకు ఒకరు
పరిష్కారముగా నిలుద్ధమా !......
అసలు ఈ జీవితం లో గెలుపంటే
ఒకరి ప్రేమను పొందడమే అనుకుంటే
ఒకరి కోసం ఒకరు అనే నిజాన్ని
ప్రపంచానికి చాటి మనల్ని మనమే గెలిపించుకుందమా !...........
నిన్ను గెలిపించాలనే ఆశతో
నీ కోసమే నీరిక్షిస్తున్నది.......
నా ప్రేమ .....నీ ప్రేమ కోసమై........
లవ్ సి
www.premkavithalu.blogspot.in
prem.saagar.k@gmail.com
No comments:
Post a Comment