Monday, 10 September 2012

నా జీవితంలో కొందరే ...........



Title: నా జీవితంలో కొందరే ...........

ఈ ప్రపచంలో ఎందరో వున్నా
నా జీవితంలో కొందరే ...........

కమ్మని ప్రేమను చూపే అమ్మ
ఒడిన చేర్చుకొని జాగ్రతను చెప్పే నాన్న
గుండె బరువెక్కినప్పుడు ఓదార్చే అక్క
అలసటలోను ఆటలాడుదామనే తమ్ముడు .....

ఒక్కడిని కాదు నేను
నలుగురికి అండను
అడుగుసాగానపుడు
వారికి నేను ఆశను......


ఆస్తి వున్నా లేకున్నా
అమ్మ ప్రేమ నాకుంది

వెలుతురున్నా లేకున్నా
నాన్న తోడు నాకుంది

అల్లరున్న లేకున్నా
అక్క మందలింపు నాకుంది

ఆకలున్న లేకున్నా
తమ్ముడి నవ్వు నాకుంది


ఒక్కడిని కాదు నేను
నలుగురికి అండను
అడుగుసాగానపుడు
వారికి నేను ఆశను.......

అమ్మ పేరు నమ్మకమైతే
నాన్న పేరు ధైర్యమౌతోంది
అక్క పేరు ఆలోచనైతే
తమ్ముడు పేరు ఆచరనౌతోంది .........

ఒక్కడిని కాదు నేను
నలుగురికి అండను
అడుగుసాగానపుడు
వారికి నేను ఆశను.........

ఓ ప్రపంచమా ఇటు చూడు
ఇదే నా కుటుంబం
ఇదే నా జీవితం
ఇదే నా మరో ప్రపంచం ......

భయమున్నా లేకున్నా భాద్యత నాకుంది

అలుపున్న లేకున్నా గెలుపు నాకందుతుంది


ఒక్కడిని కాదు నేను
నలుగురికి అండను
అడుగుసాగానపుడు
వారికి నేను ఆశను.........


 లవ్ సి

No comments:

Post a Comment