Title: ఎంత చెడ్డ .......నీ నేస్తాన్ని
నా ఫై నీకు కోపమా !
మౌనముతో ముచ్చటించకు
నా పైన కన్నెర్ర చేయకు ..........
చల్లని నీ చెలిమిలో సాగుతున్న
నా అడుగకు అడ్డు వేయకు
దరి చేరాలని నేను చెప్పే మాటలను
పెడ చెవినా నీవు పెట్టకు ...................
చంటి పిల్లాడిని కాను నేను
ఏడ్చి వురుకోవడానికి
గోడ మీద పిల్లిని కాను నేను
అరుపుతో అవతలకి దూకడానికి...................
ఎంత చెడ్డ .......నీ నేస్తాన్ని
ఎప్పటికి నిన్ను.....వదలిని నీడని.............
ఎందుకే నా ఫై నీకి కోపం ......?
ఏమి చేయనే నేను .............?
వెన్నలలోని చల్లదనాన్ని
నీ కళ్ళలో చూసే నాకు
మండే సూర్యుడిని చూపితే
నేను నిల్వ గలనా ................
వెచ్చని నీ కౌగిళ్ళలో
ప్రపంచాన్ని మరిచే నాకు
ఒంటరి తనాన్ని చూపితే
నేను తట్టుకో గలనా ........
ప్రియతమా !
ఆలోచించవే ఒకసారి
ఆలోచనలతో నడుస్తాను
ఆచరణతో నిన్ను గెలుస్తాను
లవ్ సి
www.premkavithalu.blogspot.in
prem.saagar.k@gmail.com
No comments:
Post a Comment