Saturday, 1 September 2012

నిజం.......ప్రేమ చెప్పిన నిజం


Title: నిజం........ప్రేమ  చెప్పిన నిజం


ప్రేమించి ప్రేమించి
ప్రేమకు భానిసనైనాను
ప్రేమకు రూపం ప్రేయసేనని
ఇన్నాళ్ళు భ్రమలో బ్రతికాను..........

వయస్సు పొంగులో
అమ్మ ప్రేమను మరిచాను
ఎద పొంగులను చూస్తూ
ఎదవనై పోయాను .......................

నా వెంటా వచ్చే స్నేహం
ఎందుకనుకున్నాను
అందరున్నా ప్రపంచంలో
ఒంటరినై సాగుతున్నాను..............

ఆడదాని ఆలోచనలలో
అగాధమే ధాగివున్నాను
అర్ధము చేసుకో లేక
అంధకారంలో నిలిచాను................

ఎందరో మరెందరో
హెచ్చరికలు ఇచ్చినను
అందమైన ఆడదాని
మొహంలో అందుడనైనాను............

గుండెను కోసి ఇచ్చే ప్రేమ
నా దగ్గర ఉన్నను
అడిగితివే నన్ను నీవు
నా ప్రేమకున్న విలువను.............

నష్టం వచ్చి కష్టం తెచ్చిన
నీ కౌగిళ్ళలో మరవలనుకున్నాను
రెక్కలొచ్చిన పక్షి వలె
చేరావు కదే కాసులున్న షావుకారును......................

నీ నవ్వులు కోసం
నన్ను అమ్ముకున్నాను
నీ ప్రేమ కోసం
జీవితాన్ని వదులుకున్నాను................


ఎందుకే ఇలా చేసావు
రూపాయ్ కోసమా? ..........లేక........... హోదా కోసమా?

ప్రాణంగా ప్రేమించిన వాడిని
పైసలు ఈవ్వలేనా?
హృదయంలో దాచుకున్న వాడిని
హోదాను కల్పించలేనా?.......................

ఆడదాని అందం కోసమే
తిరిగే మగ పురుగులు
చాలానే వున్నాయనుకున్న.........కాని

మగవాడిని కూడా పీల్చుకుతినే
ఆడ తేనటిగాలు వున్నాయని
నీ వల్లే నేను తెలిసుకున్న!....................

మోసపూరితమైన ప్రేమతో
ఇన్నాళ్ళు ప్రేమలో ఉన్నందుకు
నేను చాలా సిగ్గుపడుతున్నా...............

స్వచ్చమైన ప్రేమకు
అర్ధం పరమార్ధమైన అమ్మను
చేరినందుకు ఆనందపడుతున్నా ....................



""మిత్రులారా ..........ప్రేమికులారా .......గుర్తుంచుకోండి .......... ఒక్కసారి ఆలోచించండి........

ప్రేయసి ........మోసం .................మనకొక అవకాశం

ఎందుకంటే...........అమ్మానాన్నల.........ప్రేమ ఆకాశం

వారి కున్న కోరిక.......ఎప్పటికి...................మన క్షేమం

వారి కున్న గమ్యం .........జీవితం ఫై ...........మన విజయం


"""""""""""""మోసపోయానని తనువు చాలించే కన్నా

   అమ్మనాన్నల కోసం బ్రతకడమే మిన్నా""""""""""""""""""""""""""""""


తల్లిదండ్రులను ప్రేమించండి.......
ప్రేమిస్తూనే ...........
వారిని గౌరవించండి.................

లవ్ సి
prem.saagar.k@gmail.com
www.premkavithalu.blogspot.in

No comments:

Post a Comment