Title : ఆడ జన్మకు వందనం .........
తల వంచి పలుకుతున్న
అహం మరిచి చెబుతున్న
చేయెత్తి జై కొడుతూ
ఆడ జన్మకు వందనం .........
వెలుగు లేని బ్రతుకులలో
నలిగి పోతూ మీరు
చావు దెబ్బ తింటున్న
కడుపు నింపుతున్నారు .......
భాద్యత తెలియని భర్తలతో
కాపురాలు మీకు
కష్టమునే కౌగలిస్తూ
నవ్వు చూపుతున్నారు .........
నాలుగు గోడల మధ్య
కలలు కంటూ మీరు
అహంకార వేడిలో
అక్షరానికి దూరమౌతున్నారు..............
మనసు విలువ తెలియని
మృగాల మధ్య మీరు
చితి మీద తోడుగా
కాలే కట్టెగా మిగులుతున్నారు....................
ఆడదంటే ఆటలాడే బొమ్మ కాదు
ఆడు కొని వదలడానికి ...........
ఆడదంటే అంగడిలోని సరుకు కాదు
అవసరానికి అమ్ముకోడానికి..........
ఆడదంటే ఎందుకంత అలుసు
ఆడది కాదు కంటిలో నలుసు
కావాలంటే కనడానికి
వద్దనుకుంటే వదించడానికి...................
రక్తపు ముద్దకు
అమ్మతనంతో
హద్దులు లేని ప్రేమనిచ్చేది .............ఆడదంటే
మనిషికి మనసులా
మమతకు ఆత్మలా
విడదీయలేనంతగా అల్లుకు పోయేది.....ఆడదంటే
తల వంచి పలుకుతున్న
అహం మరిచి చెబుతున్న
చేయెత్తి జై కొడుతూ
ఆడ జన్మకు వందనం .........
లవ్ సి
No comments:
Post a Comment