Title: ఓ బాటసారి........... ఆలోచించావా ఒక్కసారి
గుండె నిండా ఆశ నింపుకొని
పొట్ట చేత పట్టుకొని
జీవితంలో సంతోషాన్ని అందుకోవాలని
అందరం అన్న మాట వదులుకొని
పట్టణం చేరిన ఓ బాటసారి
ఆలోచించావా ఒక్కసారి
ఎటువెలుతోందో నీ దారి........
అందమైన ఉహాలతో ఊరినే కాధాన్నావ్
అన్నం కోసం అద్దె బ్రతుకు బ్రతుకుతున్నావ్
కమ్మనైన అమ్మ ప్రేమ ఉంటె వద్దన్నావ్
కలలుకన్నా ప్రపంచంలో ఆకలితో పరిగేడుతున్నావ్
పట్టణం చేరిన ఓ బాటసారి
ఆలోచించావా ఒక్కసారి
ఎటువెలుతోందో నీ దారి........
అన్నదమ్ముల మధ్య ఐక్యమత్యం ఎందుకన్నావ్
అభిమానమే చూపేవారు కోసం అలసి పోతున్నావ్
కలిసుంటే చెంత చేరదు ఆధాయమన్నావ్
కనులు మూసుకొని కలలను చంపుకుంటున్నావ్
పట్టణం చేరిన ఓ బాటసారి
ఆలోచించావా ఒక్కసారి
ఎటువెలుతోందో నీ దారి........
అమ్మ ప్రేమ ఎప్పటికి ఆశీర్వాదం
రక్తసంబంధం సమస్యకు సమాధానం
ఎవరి దారికైన తోడొకటి అవసరం
ఎవరి ఎదుగుధలకైన ప్రోత్సాహం అవకాశం
పట్టణం చేరిన ఓ బాటసారి
ఆలోచించావా ఒక్కసారి
ఎటువెలుతోందో నీ దారి........
మూర్ఖత్వంలో ఆలోచనలు వదులుకొని
ఆవేశంలో నిరాశ పడి పోయేకన్నా
అందరి సహకారంతో బంధాలను పెంచుకుంటూ
ఆనందాలను పంచుకుంటూ నీ గమ్యాన్ని చేరుకో
పట్టణం చేరిన ఓ బాటసారి
ఆలోచించావా ఒక్కసారి
ఎటువెలుతోందో నీ దారి........
లవ్ సి
prem.saagar.k@gmail.com
www.premkavithalu.blogspot.in
No comments:
Post a Comment