Title: ప్రపంచానికి నేను ప్రశ్నల ఉండాలా?
అన్వేషించే కనులకు
సమాధానం నీ రూపం
నిరీక్షించే మనసుకు
సమాధానం నీ స్నేహం .......
సాగుతున్న అడుగు
ఆగి ఆగి అడుగుతున్నది
నిన్ను చేరే క్షణం వస్తుందా అని ?......
నన్ను చేరిన ప్రశ్నకు
పదే పదే చెబుతున్న
నిన్ను చేరే క్షణం వస్తుందని ..........
నా అన్వేషణకు....నా నిరీక్షణకు
అంతం చెప్పుతూ నన్ను చేరుకుంటావా.......లేక
అవి అనంతమని మనసుకి చెప్పుకుంటూ
నన్ను సాగి పొమ్మంటావా ........
ప్రియా !
ప్రపంచానికి నేను ప్రశ్నల ఉండాలా?
లేక .....
ప్రేమకు చిరునామాగా మారాలా......
నీవే చెప్పాలా...........
లవ్ సి
No comments:
Post a Comment