Wednesday, 8 August 2012

ప్రేమిస్తే ఇలానే చెప్పాలని అనుకుంటా! మీరు ఏమను కుంటున్నారో చెప్పండి!


ఓ ప్రియతమా!

మదిలో మెదిలో మధురమైన
భావం  ఒకటి వున్నది
ఆధారముల పైన నిలిచి
నాట్యమాడు చున్నది........

నా ఎదలో దాగివున్న భావానికి
శ్వాస నీ రూపమైతే
నీ దారిని చేరలేకున్న భావానికి
ఆశ నీ స్నేహం.....................

మౌనముతో ఎన్నోసార్లు పిలిచినా
ఆవేశంలో ఎన్నోసార్లు అరిచిన
బిడియం భయంల మధ్య సంఘర్షణ
నన్ను నీ ముందు నిలవనీయకున్నవి.............

నన్ను నడిపే నమ్మకం ఆ భావం
నా ఎదలో నిన్ను నిలిపింది ఆ భావం
ఆ భావం ఎంతో స్వచ్చమైనది
నిన్ను చేరితే నాకు జీవితమౌతుంది...............

నన్ను అలలా తాకిన భావం
కలల  కాక నిజంలా నిన్ను తాకితే
నా మనసు పాడే పాట
ఈ ప్రపంచాన్నే జయిస్తుంది.......................

భావమన్నది ప్రేమైతే అంతటా ప్రకటిస్తూ
చెబుతున్నా ప్రియా !
                             నేను నిన్ను ప్రేమిస్తున్నా................................. ఇట్లు.......... prem.saagar.k@gmail.com

No comments:

Post a Comment