నేను ప్రేమించాలనుకో లేదు
ప్రేమించడానికి అర్హతే నాకు లేదు
ప్రేమంటే ఇదేనని చెప్పనులేను
ప్రేమకు దాసోహమనే అభిమానం నేను...
ఆశ నిరాశల మధ్యనున్న జీవితంలో
నీ స్నేహపు సహవాసం అధ్బుత మైన ఆశ్చర్యం...
ప్రేమించడానికి నేనేపాటి వాడినో
నాకే తెలియనంతగా ప్రేమిస్తున్నాను
నీకే చెప్పలేనంతగా ప్రేమిస్తున్నాను
మన కోసం ఆ ప్రేమను ఎప్పుడూ స్వాగతిస్తునే ఉంటాను....
Happy valentines day ❤❤
@ ప్రేమ్ సాగర్ కోటపూరి
No comments:
Post a Comment