నీ భయమే
నీకు అభయం
ఇచ్చెలా ఆలోచించు
నీలోని భయమే
నిన్ను ఆడించేలా
ఎప్పుడు ఆలోచించకు
భయానికి ఎప్పుడు రూపమిచ్చేది నువ్వే
భయానికి పరుగు పెట్టి చచ్చేది నువ్వే
భయాన్ని అందలం ఎక్కించేది నువ్వే
భయానికి బానిస వై బ్రతికేది నువ్వే!
భయంతో రాజీపడకు
భయంతో సంకెళ్లు వేసుకోకు
భయానికి అవకాశమివ్వకు
భయానికి బయపడి ఆగిపోకు
ఎందుకంటే
నిజమైనా భయం
శ్రద్దకు సూచన
నిజాయితీగల భయం
గెలిపుకి ప్రతీక...
@ ప్రేమ్ సాగర్ కోటపూరి
No comments:
Post a Comment