అనంత సాహితీ వేదిక
తేదీ : 17/9/2025( బుధవారం)
అంశం : ప్రాణం ఖరీదు
రచన : ప్రేమ్ సాగర్ కోటపూరి
ఊరు : కోవూరు, నెల్లూరు జిల్లా
చరవాణి : 9542000079
శీర్షిక : ఎవరు కట్టగలరో ఖరీదు
విచిత్రమైన మాయా ప్రపంచంలో
అర్ధమేకాని వింతైనా ప్రశ్న యెకటి ఎదురుచూపుల దాడి చేస్తుంది విలువే తెలియని సమాధానంకోసం
ఎవరికి తెలుసు ఏ తూకం తేలుస్తుందో ఏలాంటి రంగు కాగితాలకి నిలుస్తుందో చెప్పలేని హాస్యాస్పదమైన ఆలోచనలకి రూపమే ప్రాణం ఖరీదు
పురుడు పోసుకునే బిడ్డకై తల్లి చేసే ప్రాణసహితమైన ప్రయత్నమే ఖరీదూ
కడుపు నింపుకునే ఆరాటంలో పీకలు తెగి కొట్టుమిట్టాడు తున్నప్పుడు ఆకలే ఖరీదు
వాహనాల వేగానికి రెప్పపాటులో స్మశానంలో భాగమై బంధాలే విడిచేప్పుడు నిర్లక్ష్యమే ఖరీదు
ఒడ్డున పడాలని చావు బ్రతుకు ఆటలో గెలవాలని హింసలు పడుతున్నప్పుడు భేరసారాలాడే ఆశే ఖరీదు
బలాత్కారాల భారిన పడి మౌన రోధనలో బలికాబడుతున్నప్పుడు మరిచే విచక్షణే ఖరీదు
అన్నీటికి విలువకట్టే మానవ మృగం లోన చేరి ఆడిస్తుంటే
సర్వం కోల్పోతున్నా నోరు కదపలేని సంగ జీవులం అందుకు మృతిమయమైన మనస్సాక్షే ఖరీదు
అడిగినా అరిచినా వెలకట్టలేని గొప్పదిగా విలువివ్వలేనంత తేలికగా చూసే అరుదైన అద్భుతం ఓ ప్రాణం ఎవరు కట్టగలరో ఖరీదు
✍️అనిర్వ✍️
ప్రేమ్ సాగర్ కోటపూరి
ఇది నా స్వీయ రచనని హామీ ఇస్తున్నాను
@ ప్రేమ్ సాగర్ కోటపూరి
No comments:
Post a Comment