Sunday, 29 December 2024

పెద్దరికం

   **

పెద్దరికం అంటే వయస్సు కాదు
సంపాదిస్తే వచ్చేది అంతకన్నా కాదు..

మూర్ఖత్వపు ముసుగులో
దాగేది కాదు
శాసించలనే ధోరణి అంతకన్నా కాదు..

స్పృహ లేనిది కాదు
సమస్యల తాలూకా అంతకన్నా కాదు..

ధరహాసపు దీవెనే 🙌
పెద్దరికం అంటే..

మాటజారని మనస్తత్వమే👌
పెద్దరికం అంటే..

హృదయపూర్వక మర్యాదే 🫰
పెద్దరికం అంటే..

సరిదిద్దే సంస్కారమే🙏
పెద్దరికం అంటే..


Prem sagar kotapuri

29/12/24

No comments:

Post a Comment