Monday, 31 December 2012


సిగ్గు పడుతున్నాను తల్లి
నేను సిగ్గుపడుతున్నాను
సిగ్గు పడుతున్నాను చెల్లి
నేను సిగ్గుపడుతున్నాను .....

అలసి పోతున్నారు ఆడవారు
మగవాడి వేటాడే చూపులకు
తల్లడిల్లి పోతున్నారు ఆడవారు
భయం పుట్టించే మగవాడి అరుపులకు .....
                                                  సిగ్గు పడుతున్నాను తల్లి
                                                  నేను సిగ్గుపడుతున్నాను చెల్లి

చచ్చి బ్రతుకుతున్నారు ఆడవారు
మూర్ఖపు మగవాడి చేష్టలకు
బ్రతుకు జీవుడా అని అర్ధిస్తున్నారు ఆడవారు
అహాంకారి మగవాడి అధికారాలకు ....................
                                                  సిగ్గు పడుతున్నాను తల్లి
                                                  నేను సిగ్గుపడుతున్నాను చెల్లి

చీకటి వెలుగుల మధ్య
తేడానే లేకుండా
నలిగి పోతున్నారు ఆడవారు
మగవాడి కాలి కింద చీమ వలె  .......
                                                  సిగ్గు పడుతున్నాను తల్లి
                                                  నేను సిగ్గుపడుతున్నాను చెల్లి

చిన్న పెద్దా అంటూ
తేడానే లేకుండా
లోకాన్నే విడుస్తున్నారు ఆడవారు
మగవాడి వదిలే సిగరెటు పొగ వలె
                                                  సిగ్గు పడుతున్నాను తల్లి
                                                  నేను సిగ్గుపడుతున్నాను చెల్లి

మగవాడి నన్నా గర్వమా
మగవాడికి ఇంత బలము
అందుకే నెమో .............
మగవాడి ఒంటికి ....కంటికి
ఆడదంటే అంత బలహీనము .....
                                                 సిగ్గు పడుతున్నాను తల్లి
                                                 నేను సిగ్గుపడుతున్నాను
                                                 సిగ్గు పడుతున్నాను చెల్లి
                                                 నేను సిగ్గుపడుతున్నాను.......

ఏ అన్నకు వున్నా చెల్లి లో
ఏ తల్లి కి కలిగిన కూతురో .......

మనుషులలో మృగాలు
వెంటాడి వేటాడు తుంటే
మానం...ప్రాణం కోసం
ఒంటరి పోరాటం చేస్తున్నారు ........
                                       సిగ్గు పడుతున్నాను తల్లి
                                       నేను సిగ్గుపడుతున్నాను చెల్లి

పిచ్చి కుక్కలా వలె
పిచ్చి నా కొడుకులు
కనిపించే ఆడపడుచులను
కామపిశాచులై పిక్కూతింటున్నారు ..........
                                              సిగ్గు పడుతున్నాను తల్లి
                                               నేను సిగ్గుపడుతున్నాను చెల్లి

మానాన్ని భక్షిస్తుంటే
ప్రాణాల్ని  హరిస్తుంటే
ఎర్రి బాగు ఆడపిల్లలు
పిల్ల లై రోధిస్తున్నారు...........
                                           సిగ్గు పడుతున్నాను తల్లి
                                          నేను సిగ్గుపడుతున్నాను చెల్లి

మగ జాతిలో ఒకడి నై నందుకు
సిగ్గు పడుతున్నాను తల్లి
                            నేను సిగ్గుపడుతున్నాను
మృగాల్లాంటి మగాళ్ళ మధ్యనున్నందుకు
సిగ్గు పడుతున్నాను చెల్లి
                            నేను సిగ్గుపడుతున్నాను

Thursday, 27 December 2012

నా నైజం


ప్రియా!

అవకాశం  ఇవ్వకుండానే
ఆలోచన చేయకుండానే
మంచి చెడు తెలుసుకునే
ప్రయత్నం చేయకుండానే

ప్రకటించిన నా ఆశను
త్రుంచి వేయడం ...........నీకు న్యాయమా !

నేను ఏమిటో
నా ఆలోచన ఏమిటో ......తెలుసుకోకుండానే

నువ్వు ఏమిటో
నీ ఆలోచన ఏమిటో ......చెప్పకుండానే

ఇష్టం లేదంటూ నన్ను
నీవు దాటి పోవడం ..........నీకు న్యాయమా !

ప్రపంచం లో  అతి ప్రాముఖ్యత
కలిగిన మూడు మాటలను
తమ సౌకర్యం కోసంగా
వాడుకుంటున్న మాటలను
నీకు చెప్పి స్వార్ధపరుడినిగా
నీ ముందు నేను నిలువలేను .......అది నా నైజం

స్నేహమంటూ  నిన్ను చేరుకొని
సరదాగా సమయాన్ని గడపలేక కాదు
ప్రేమంటూ నిన్ను కలుపుకొని
ప్రాణం అంటూ నీ చుట్టూ తిరగ లేక కాదు

ఫై రెండింటిని  సైతం తనలో
నింపుకొని మనల్ని ముందుకు నడిపే
బంధం....భార్యాభర్తల సంబంధం
అన్యులకు అర్ధం కాని అనుబంధం...........

సమస్యలలో  స్నేహితుడినవుతా
సరదాలలో ప్రేమికుడినవుతా
భాద్యతలలో భరించే భర్తనవుతా
జీవితాంతం నీ వెంట నేనుంటా..............






Wednesday, 26 December 2012

అక్క !


అక్క !
ఏ తమ్ముడు ఇవ్వనటువంటి
బహుమతి ఇవ్వాలని
ప్రపంచం లోనే అందమైనది
నీకు తెచ్చివ్వాలని పరిగెడు తున్న
క్షణాన జారి పడితే తెలిసింది ................నా అవివేకం

నీ నవ్వుని మించిన అందాన్ని
నేను ఎందులోనూ చూడలేనని
ఆ నవ్వు నీకు ఎప్పుడు దూరం
కాకుండా చూసుకోవడమే
తమ్ముడిగా నా భాద్యతని ..............

అక్షరాలను జత కలిపి
కవి అవతారమెత్తి
నీకో కవిత రాసివ్వాలను కున్న
క్షణాన గుర్తుకు వచ్చెను  నాకు ......నా ఆవేశం

నీ కళ్ళలోని కరుణ ముందు
మాటలోని మంచి ముందు
స్పర్శలోని ప్రేమ ముందు
ఏమని చెప్పను ....ఎంతని చెప్పను
నీ తమ్ముడిగా నేను అదృష్ట వంతుడనని.............


అమ్మ ప్రేమకు ప్రతి రూపమైన
మరో రూపము నువ్వు
అడగకనే దేవుడిచ్చిన
అనుబంధము నువ్వు ............

అక్క.....
ఈ జన్మలో
నీకు తమ్ముడనైన
మరు జన్మలో
నీకు తనయుడిని ....అవ్వాలని కాంక్షిస్తూ చెబుతున్న.....అక్క .....జన్మదిన శుభాకాంక్షలు

ఇట్లు....
తనయుడి కాని తమ్ముడు
తనయుడితో సమానమైన తమ్ముడు
ఇప్పటికి .....ఎప్పటికి... ....నీ తమ్ముడు




Sunday, 23 December 2012

మనిషిని నేను ..........


నేను మనిషినే
అని నమ్మే ప్రతి ఒక్కరిని
కలవాలను కునే స్వార్ధపరుడిని........

ప్రేమించే ప్రతి మనిషిని
ప్రేమించాలను కునే
సామాన్యమైన ప్రేమికుడిని ........

ప్రతి చిన్న కష్టానికి
దేవుడు లేడనుకునే
గొప్ప నాస్తికుడిని .......

ఆకలి తీరు తున్నప్పటికి
అనుకున్నది జరగలేదనుకునే
దురదృష్ట వంతుడిని............

అందరికి కన్నీళ్ళు వున్నా
నాకు ఉండకూడా దనుకునే
అలవాటైన ఆశ జీవిని .....................

ఎన్ని చెప్పినా
ఏమి చెప్పినా
కష్టాలకు దూరంగా
కోరికలకు దగ్గరగా ......

జీవించాలను కునే
సగటు మనిషిని నేను ..........