భక్తినిచ్చే భయం
ముక్తినిచ్చే భయం
విముక్తినిచ్చే భయం
ఎదగ నిచ్చే భయం
గెలుపునిచ్చే భయం
గౌరవ మిచ్చే భయం..ఉండాలే తప్ప!
బానిస బ్రతుకు నిచ్చే భయం కాదు!!
బానిసలా బ్రతక నిచ్చే భయం కాదు!!
నీ భయమే
నీకు అభయం కావాలి
నీ దృక్పథమే
నీ జీవితాన్ని మార్చాలి !!
@ ప్రేమ్ సాగర్ కోటపూరి
16/08/2024