Monday, 4 September 2023

ఓ చెల్లమ్మా

 చిర్రు బిర్రు లాడే ఓ చెల్లమ్మా 

మనసులో నీ స్థానం సుస్థిరమమ్మా


అమ్మ పేగు పంచుకోనూలేదు 

రక్త సంబంధం అంతకన్నా కాదు 

ఆత్మీయతకు మరో రూపమైనావు

నీ పేరుతో మరో తోబుట్టువైనావు


అల్లరితో ఆటపట్టించే ఓ చెల్లమ్మా 

మనసులో నీ స్థానం సుస్థిరమమ్మా


మనసులోని బంధానికి 

మనిషిలోని మంచితనానికి 

స్వచ్ఛమైన పలకరింపుకి 

హద్దులు దిద్దే వారెవ్వరమ్మా