పదే పదే అనిపిస్తుంది
ప్రశ్నించాలని ఈ ప్రపంచాన్ని...
స్వేచ్ఛా భారతం కోసం
ఎందరో త్యాగాలు చేశారు!
బానిసలుగా బ్రతుకుతుంటే
బంధకాల నుంచి విడిపించారు!!
నేటికి బానిసత్వం పోయిందా
లేక మానవత్వం పోతుందా!!!
!!ఎక్కడుంది స్వేచ్ఛ!!
!!ఎక్కడుంది స్వతంత్రం!!
కన్న తల్లి చెప్తుంది
కలల ప్రపంచం ముందుందని!
కన్న తండ్రి చెప్తున్నాడు
భావితర భవిష్యత్తు మీదేనని!!
ఆశలు ఆకాశాన్నే అంటుతుంటే
అవసరాలు నిరాశతో చంపుతుంటే!!!
!!ఎక్కడుంది స్వేచ్ఛ!!
!!ఎక్కడుంది స్వతంత్రం!!
అధికారాలు కోసం ఆరాటమే
ఎక్కిస్తుంది లంచాన్ని మంచమే!
అవకాశాలు కోసం ఆలోచనలే
అమ్ముకుంటుంది ఆత్మాభిమానమే!!
తింటున్నోడు తింటూనే ఉన్నాడు
లేని వాడు చస్తూనే బ్రతుకుతున్నాడు!!!
!!ఎక్కడుంది స్వేచ్ఛ!!
!!ఎక్కడుంది స్వతంత్రం!!
అమ్మప్రేమతో పోలుస్తూ
ప్రతిది కల్తీ చేసి అమ్ముతుంటే!
అభివృద్ధి పేరు చెప్తూనే
దేశాన్ని తాకట్టుపెడుతుంటే!!
జయహో నాయకా అంటూ
పార్టీ జెండా పట్టి జేజేలు కొడుతుంటే!!!
!!ఎక్కడుంది స్వేచ్ఛ!!
!!ఎక్కడుంది స్వతంత్రం!!
చదివే చదువులలో నాణ్యత లేదు
చేసే పనులలో నిబద్ధత లేదు!
నైపుణ్యం ఉన్న వెలుగులోకి రాదు
అయ్యా! శరణ్యమంటున్నా గతిలేదు!!
తెలివి దేశాలు దాటిపోతుంటే
పుట్టుకొస్తుంది తీవ్రవాదం విస్తరిస్తుంది హింసనాదం!!!
!!ఎక్కడుంది స్వేచ్ఛ!!
!!ఎక్కడుంది స్వతంత్రం!!
ఆర్థిక బలములేక రైతన్నలు
పల్లెటూర్లలో బలి పశువులవుతుంటే!
ఆధునిక సమాజంలోయవ్వనస్థులు
వేగవంతమైన జీవితం వైపు పరిగెడుతూ!!
Facebook లో ఉద్యమాలు చేస్తూ
Whatsapp లో సంతాపాలు తెలుపుతుంటే!!!
!!ఎక్కడుంది స్వేచ్ఛ!!
!!ఎక్కడుంది స్వతంత్రం!!
కవులు చెప్పే మాటలలో
ఆడదొక అద్భుతమైనది!
ప్రాణం పెట్టి ప్రాణం ఇస్తున్నా సమాజంలో ఆడకూతురొక దౌర్భాగ్యమైనది!!
పుట్టిన చోటునే వెతుక్కుంటూ
కొందరు మృగాలుగా ఎగబడుతుంటే!!!
!!ఎక్కడుంది స్వేచ్ఛ!!
!!ఎక్కడుంది స్వతంత్రం!!
@PSK@ prem.saagar.k@gmail.com
ప్రశ్నించాలని ఈ ప్రపంచాన్ని...
స్వేచ్ఛా భారతం కోసం
ఎందరో త్యాగాలు చేశారు!
బానిసలుగా బ్రతుకుతుంటే
బంధకాల నుంచి విడిపించారు!!
నేటికి బానిసత్వం పోయిందా
లేక మానవత్వం పోతుందా!!!
!!ఎక్కడుంది స్వేచ్ఛ!!
!!ఎక్కడుంది స్వతంత్రం!!
కన్న తల్లి చెప్తుంది
కలల ప్రపంచం ముందుందని!
కన్న తండ్రి చెప్తున్నాడు
భావితర భవిష్యత్తు మీదేనని!!
ఆశలు ఆకాశాన్నే అంటుతుంటే
అవసరాలు నిరాశతో చంపుతుంటే!!!
!!ఎక్కడుంది స్వేచ్ఛ!!
!!ఎక్కడుంది స్వతంత్రం!!
అధికారాలు కోసం ఆరాటమే
ఎక్కిస్తుంది లంచాన్ని మంచమే!
అవకాశాలు కోసం ఆలోచనలే
అమ్ముకుంటుంది ఆత్మాభిమానమే!!
తింటున్నోడు తింటూనే ఉన్నాడు
లేని వాడు చస్తూనే బ్రతుకుతున్నాడు!!!
!!ఎక్కడుంది స్వేచ్ఛ!!
!!ఎక్కడుంది స్వతంత్రం!!
అమ్మప్రేమతో పోలుస్తూ
ప్రతిది కల్తీ చేసి అమ్ముతుంటే!
అభివృద్ధి పేరు చెప్తూనే
దేశాన్ని తాకట్టుపెడుతుంటే!!
జయహో నాయకా అంటూ
పార్టీ జెండా పట్టి జేజేలు కొడుతుంటే!!!
!!ఎక్కడుంది స్వేచ్ఛ!!
!!ఎక్కడుంది స్వతంత్రం!!
చదివే చదువులలో నాణ్యత లేదు
చేసే పనులలో నిబద్ధత లేదు!
నైపుణ్యం ఉన్న వెలుగులోకి రాదు
అయ్యా! శరణ్యమంటున్నా గతిలేదు!!
తెలివి దేశాలు దాటిపోతుంటే
పుట్టుకొస్తుంది తీవ్రవాదం విస్తరిస్తుంది హింసనాదం!!!
!!ఎక్కడుంది స్వేచ్ఛ!!
!!ఎక్కడుంది స్వతంత్రం!!
ఆర్థిక బలములేక రైతన్నలు
పల్లెటూర్లలో బలి పశువులవుతుంటే!
ఆధునిక సమాజంలోయవ్వనస్థులు
వేగవంతమైన జీవితం వైపు పరిగెడుతూ!!
Facebook లో ఉద్యమాలు చేస్తూ
Whatsapp లో సంతాపాలు తెలుపుతుంటే!!!
!!ఎక్కడుంది స్వేచ్ఛ!!
!!ఎక్కడుంది స్వతంత్రం!!
కవులు చెప్పే మాటలలో
ఆడదొక అద్భుతమైనది!
ప్రాణం పెట్టి ప్రాణం ఇస్తున్నా సమాజంలో ఆడకూతురొక దౌర్భాగ్యమైనది!!
పుట్టిన చోటునే వెతుక్కుంటూ
కొందరు మృగాలుగా ఎగబడుతుంటే!!!
!!ఎక్కడుంది స్వేచ్ఛ!!
!!ఎక్కడుంది స్వతంత్రం!!
@PSK@ prem.saagar.k@gmail.com