Friday, 18 September 2015

......."ఒక రోజుకున్నగొప్పతనం".......

ఓ నేస్తమా !

రోజన్నది చిన్నది కాదు
కనులు మూసుకొని మరిచి పోవడానికి ............

రోజన్నది అంతము కాదు
ఆశలతో సాగకుండ ఆగి పోవడానికి..........

రోజన్నది ఓ ఆయుధం
నేర్చుకోవాలనుకునే వాడికి....................

రోజన్నది ఓ అవకాశం
ప్రయత్నించాలనుకునే వాడికి.................

రోజన్నది ఓ అయోమయం
భయంలోనే బ్రతికే వాడికి...................

రోజన్నది ఓ అద్భుతం
జీవితంలో గెలిచేవాడికి..........................

నేర్చుకున్నది యెంతని
ప్రశ్నించుకునే వాడు
నేర్చుకోవాల్సింది చాలానే
ఉందని గ్రహించిన వాడు...........................

అయోమయ్యాన్ని వదిలి
అవకాశాన్ని చూస్తాడు................
అవకాశాన్ని చూసిన వాడు
ఆయుధాన్ని చేపడతాడు.....................
ఆయుధాన్ని అందుకున్నవాడు
అద్భుతాన్ని సృష్టిస్తాడు...................

జీవితంలో మనల్ని వీడిన ప్రాణాన్ని
కళ్ళముందే కరిగిపోయిన కాలాన్ని
ఎప్పటికి తీసుకురాలేమన్న నిజాన్ని
అర్ధం చేసుకున్నవాడు జయిస్తాడు ప్రపంచాన్ని..............ఇది నిజం


lovesea.............prem.saagar.k@gmail.com