Friday, 18 September 2015

......."ఒక రోజుకున్నగొప్పతనం".......

ఓ నేస్తమా !

రోజన్నది చిన్నది కాదు
కనులు మూసుకొని మరిచి పోవడానికి ............

రోజన్నది అంతము కాదు
ఆశలతో సాగకుండ ఆగి పోవడానికి..........

రోజన్నది ఓ ఆయుధం
నేర్చుకోవాలనుకునే వాడికి....................

రోజన్నది ఓ అవకాశం
ప్రయత్నించాలనుకునే వాడికి.................

రోజన్నది ఓ అయోమయం
భయంలోనే బ్రతికే వాడికి...................

రోజన్నది ఓ అద్భుతం
జీవితంలో గెలిచేవాడికి..........................

నేర్చుకున్నది యెంతని
ప్రశ్నించుకునే వాడు
నేర్చుకోవాల్సింది చాలానే
ఉందని గ్రహించిన వాడు...........................

అయోమయ్యాన్ని వదిలి
అవకాశాన్ని చూస్తాడు................
అవకాశాన్ని చూసిన వాడు
ఆయుధాన్ని చేపడతాడు.....................
ఆయుధాన్ని అందుకున్నవాడు
అద్భుతాన్ని సృష్టిస్తాడు...................

జీవితంలో మనల్ని వీడిన ప్రాణాన్ని
కళ్ళముందే కరిగిపోయిన కాలాన్ని
ఎప్పటికి తీసుకురాలేమన్న నిజాన్ని
అర్ధం చేసుకున్నవాడు జయిస్తాడు ప్రపంచాన్ని..............ఇది నిజం


lovesea.............prem.saagar.k@gmail.com

Saturday, 8 August 2015

స్నేహితులదినోత్సవ శుభాకాంక్షలు

కమ్మని మాటల్లో అమ్మగా
చిరుకోపపూ మందలింపులో నాన్నగా

వెచ్చని భయములో తోడుగా 
చిక్కటి భాధలో ఆత్మగా 

చల్లటి నవ్వులో శ్వాసగా 
అడుగు దూరంలో వుండే వరముగా 

స్వచ్చతనముతో స్వేచ్చగా మనలోనే వుంటూ
ఎప్పటికి మనతోనే ఉండాలనుకునే రూపము.....అపూర్వమైన స్నేహము 

అట్టి స్నేహము...
మన మద్య వున్నందుకు...
ఆనందిస్తూ....స్నేహితులదినోత్సవ శుభాకాంక్షలు నేస్తమా......

లవ్ సి 
prem.saagar.k@gmail.com

నేస్తమా .... నీ కోసం

ఆశన్నది నీకుంటే చాలు...
ఒకరి ప్రోత్సాహం అవసరమే రాదు...

ఓర్పన్నది నీకుంటే చాలు...
ఒకరి ఓదార్పు మాటలతో పనేలేదు...

రెండగుల నడక ఒక్క అడుగై పరుగైనప్పుడు....
ప్రయత్నించే దూరంలో వుండే గెలుపు నిన్ను చేరదా....

నిన్ను నువ్వు నమ్ముకుంటే....
నాలుగు దిక్కులు నీవే....

అది నిజమని చెప్పాల్సింది...
నువ్వు........నీ నవ్వే...

లవ్ సి...
prem.saagar.k@gmail.com

Always be positive and think positive